SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bank Holiday Tomorrow: రేపు బ్యాంకులకు సెలవు..ఈ రాష్ట్రాల్లో అన్నీ బ్యాంకులు బంద్..తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే!

Bank Holiday Tomorrow News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15, మంగళవారం నాడు పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. గుజరాత్, ఒడిశా, గోవా రాష్ట్రాల్లో స్థానిక పండుగల కారణంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి. అయితే, తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) సహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు యథావిధిగా పనిచేస్తాయి.

Written By Harish Darla
Published: Sep 14, 2026, 04:34 PM IST | Updated: Sep 14, 2026, 04:40 PM IST
Join

Bank Holiday Tomorrow News: వినాయక చవితి సందర్భంగా తాజాగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 15న బ్యాంకులు మూతపడనున్నాయని సమాచారం అందుతోంది. అయితే బ్యాంకులు సెప్టెంబర్ 15, మంగళవారం నాడు గుజరాత్, ఒడిశా, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేయవు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ వంటి ప్రధాన బ్యాంకుల శాఖలన్నీ రేపు మంగళవారం (సెప్టెంబరు 15) మూతపడతాయి.  ఆయా రాష్ట్రాల్లో క్రింది ముఖ్యమైన ఉత్సవాల కారణంగా ఈ సెలవు అమలులో ఉంటుంది.

సంవత్సరి (చతుర్థి పక్షం)..
జైన మతంలో అత్యంత పవిత్రమైన ఈ పండుగ రోజున భక్తులు ఆత్మపరిశీలన చేసుకుని. త్రికరణ శుద్ధిగా చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటారు. గుజరాత్‌లో ఈ సందర్భంగా సెలవు ఉంటుంది.

నువాఖాయ్: ఇది ఒడిశా, దాని పరిసర ప్రాంతాలలో ఘనంగా జరుపుకునే వ్యవసాయ పండుగ. కొత్త పంట ధాన్యాన్ని దేవుళ్లకు సమర్పించి, కుటుంబ సమేతంగా పూజలు నిర్వహిస్తారు.

గణేష్ చతుర్థి (రెండవ రోజు): గోవా తదితర ప్రాంతాల్లో వినాయక చతుర్థి రెండవ రోజున కూడా విగ్రహారాధన, హారతులు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకుల పరిస్థితి గమనిస్తే.. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాలు మినహా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మంగళవారం నాడు బ్యాంకులు తెరిచే ఉంటాయి. అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి.

సెప్టెంబర్ నెలలోని ఇతర ముఖ్య బ్యాంక్ సెలవులు
ఈ నెలలో వివిధ పండుగలు మరియు ప్రత్యేక దినాల సందర్భంగా పలు నగరాల్లో సెలవులు ఉన్నాయి.
సెప్టెంబర్ 14 (సోమవారం): గణేష్ చతుర్థి, వరసిద్ధి వినాయక వ్రతం, హర్తాలిక తీజ్ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, భువనేశ్వర్ మొదలైన నగరాల్లో బ్యాంకులు మూసివేయబడ్డాయి

సెప్టెంబర్ 18: యూనిటేరియన్ వార్షికోత్సవం సందర్భంగా మేఘాలయలో సెలవు

సెప్టెంబర్ 21: శ్రీమంత శంకరదేవ్ జయంతి, శ్రీ నారాయణ గురు సమాధి సందర్భంగా భువనేశ్వర్, తిరువనంతపురంలో మూసివేత.

సెప్టెంబర్ 22, 23, 25: కర్మ పూజ (రాంచీ), మహారాజా హరి సింగ్ జయంతి (జమ్మూ, శ్రీనగర్), ఇంద్రజాతర (గాంగ్‌టక్) సందర్భంగా సెలవులు.

సెప్టెంబర్ 26, 27: నాల్గవ శనివారం, ఆదివారం సెలవులు.
బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే వినియోగదారులు ఆర్‌బీఐ సెలవుల జాబితాను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

Also Read: BRICS Dollar Declaration: డాలర్‌‌కు దెబ్బ కొట్టేందుకు బ్రిక్స్ పెద్ద ప్లాన్..బ్రిక్స్ దెబ్బకు ట్రంప్ విలవిల!

Also Read: యాపిల్ ఐఫోన్ 18 సంచలనం..మడతబెట్టే ఐఫోన్ వచ్చేసింది..ఒక్కోటి రూ.3 లక్షలు మాత్రమే!


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES