SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BSNL Insurance Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ ఇన్సూరెన్స్ మీ కోసం!

BSNL Free Insurance Offer: భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - BSNL) తన వినియోగదారులతో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ వినూత్నమైన బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2 ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా వినియోగదారులు ఉచితంగా రూ.1 లక్ష వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్‌ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

Written By Harish Darla
Published: Oct 01, 2026, 05:42 PM IST | Updated: Oct 01, 2026, 05:46 PM IST
Join

BSNL Free Insurance Offer: భారత దేశంలో ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ వినియోగదారులను నిలుపుకోవడంతో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబరు 1 నుంచి అందుబాటులో ఉండే కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై బీఎస్ఎన్ఎల్ ఉచిత ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఉచిత ఇన్సూరెన్స్, సెబర్ సెక్యూరిటీ ప్రయోజనాలను పొందేందుకు బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు ప్రత్యేక టారిఫ్ వోచర్లలో ఏదైనా ఒకదానితో చేసుకోవాల్సి ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిన రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్..
1) ఎస్టీవీ 202 (STV 202) ప్లాన్ వివరాలు..
ఈ ప్రత్యేక ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ కాలపరిమితితో లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న చందాదారులకు 300 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు 5 జీబీ డేటా, 100 SMSలు వస్తాయి. వీటితో పాటు అదనంగా ఎలాంటి రుసుము లేకుండా ఉచిత ప్రమాద బీమా, సైబర్ ఫ్రాడ్ కవరేజీ సదుపాయాలు లభిస్తాయి.

2) ఎస్టీవీ 2449 (STV 2449) ప్లాన్ వివరాలు..
ఇది 365 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీ కలిగిన వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులు ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు కూడా ఏడాది పొడవునా ఉచిత బీమా సదుపాయం వర్తిస్తుంది.

బీమా పాలసీ యాక్టివేషన్, సేవలు..
కస్టమర్ అర్హత కలిగిన ప్లాన్‌తో రీఛార్జ్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే బీమా పాలసీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం రీఛార్జ్ కన్ఫర్మేషన్ SMS ద్వారా వినియోగదారుల మొబైల్ నంబర్‌కు పంపనున్నారు. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ అనేది ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అమలులో ఉంటుంది. పైన పేర్కొన్న రీఛార్జ్ ప్లాన్స్‌ను పొందిన కస్టమర్లు రూ.1 లక్ష వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభించడంతో పాటు.. బీఎస్ఎన్ఎల్ నంబర్ ఉపయోగించి ఒకవేళ ఏదైనా సైబర్ స్కామ్స్, ఆర్థిక మోసాలు జరిగితే వారికి రూ.10,000 వరకు సైబర్ ఫ్రాడ్ కవరేజీ లభించడంతో పాటు వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES