SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

Diwali Insurance Policy: దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి వినియోగదారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' (PhonePe) ఒక ప్రత్యేకమైన బీమా పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Written By Bhoomi
Published: Oct 22, 2026, 03:17 PM IST | Updated: Oct 22, 2026, 03:19 PM IST
Image Credit: Diwali Insurance Policy:
Join

Diwali Insurance Policy: దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి వినియోగదారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' (PhonePe) ఒక ప్రత్యేకమైన బీమా పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది.  పండుగ సంబరాల్లో అనుకోకుండా ఎదురయ్యే అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను అధిగమించేందుకు ఉద్దేశించిన ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ను వరుసగా 3వ సంవత్సరం కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం రూ. 11 వంటి తక్కువ ప్రీమియంతో ప్రారంభం అయ్యే ఈ పాలసీ.. అనుకోని ప్రమాదం జరిగిన సమయంలో రూ. 25వేల వరకు వైద్య కవరేజీని అందిస్తుంది.

దీపావళి వేడుకల్లో ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా సంతోషంగా పాల్గొనేందుకు ఈ పాలసీ ఎంతో దోహదం చేస్తుందని ఫోన్ పే చెబుతోంది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ సీజనల్ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. పండగ సమయంలో టపాసుల వల్ల ప్రమాదం జరిగినప్పుడు అయ్యే వైద్య ఖర్చుల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం క ల్పించడమే ఈ  దీని ప్రధాన లక్ష్యం. సరళమైన పారదర్శకమైన నిబంధనలతో ఈ పాలసీని రూపొందించింది ఫేన్ పే.

పాలసీ కవరేజ్ వివరాలు:

ఈ బీమా పాలసీ మూడు ప్రధాన విభాగాలలో రక్షణను అందిస్తుంది.

ఆసుపత్రి ఖర్చుల కవరేజ్:  అగ్నిప్రమాదం కారణంగా 24 గంటల కంటే ఎక్కువ ఆసుపత్రిలో చేరినట్లయితే రూ. 25,000 వరకు వైద్య ఖర్చులను తిరిగి పొందవచ్చు.

డేకేర్ చికిత్స: చిన్నపాటి కాలిన గాయాలకు లేదా 24 గంటలలోపు చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులను  రూ. 25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ప్రమాదవశాత్తు మరణం: ఒకవేళ పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే, వారి కుటుంబానికి (నామినీ) రూ. 25,000 ఏకమొత్తం పరిహారం అందుతుంది. ఈ ప్రయోజనం కేవలం ప్రాథమిక పాలసీదారుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పాలసీని ఎలా పొందాలి?

వినియోగదారులు తమ PhonePe యాప్ ద్వారా నిమిషంలోపే ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ముందుగా, PhonePe యాప్‌లోని 'ఇన్సూరెన్స్' విభాగానికి వెళ్లి, 'ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్' ఎంపికను ఎంచుకోండి.

అక్కడ ప్లాన్ వివరాలు, అంటే రూ.25,000, కనిపిస్తాయి. రూ.11 లేదా రూ.21 ప్రీమియం ఎంపికలతో రూ.25,000 భీమా కవరేజ్.

పాలసీ ప్రయోజనాలు, భీమా సంస్థ వివరాలను సమీక్షించిన తర్వాత, పాలసీదారుని వివరాలను నమోదు చేయండి.

చివరగా, 'చెల్లింపునకు కొనసాగండి' (Proceed to Pay) బటన్‌ను నొక్కి, చెల్లింపును పూర్తి చేయండి.  పాలసీ తక్షణమే యాక్టివేట్ అవుతుంది.

ఈ సులభమైన ప్రక్రియతో, పండుగ సీజన్‌లో మీరు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించవచ్చని ఫోన్‌పే సూచిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES