Bunny Review on Rajinikanth Jailer 2: అవును సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. ఈ సినిమా కామన్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ మూవీపై తన మార్క్ రివ్యూ అందించారు. ‘జైలర్ 2’ కూడా జైలర్ లాగా అదిరిపోయిందన్నారు. రజినీ సార్ స్టార్ పవర్, స్వాగ్, అరా అన్ని కలిపి ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌ను చేశాయన్నారు. ప్రతి సీన్‌లో రజినీకాంత్ తన మ్యానరిజంతో ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పుకొచ్చారు.
చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు..
అంతేకాదు అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. సినిమాలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్, నిర్మాత అందరు ప్రేక్షకుల మనసును దచారు. నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి తన మార్క్ డైరెక్షన్‌తో మెప్పించారంటూ కొనియాడారు. అంతేకాదు చొక్కా నలగకుండా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఒక్క రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యం అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
‘జైలర్ 2’ వసూళ్లు..
ఇక బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజినీకాంత్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. విడుదలైన వారంలోనే సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తమిళనాట అత్యధిక వసూళ్లు రజినీకాంత్, శంకర్‌ల ‘2.O’ మూవీపై రికార్డు ఉంది. ఆ రికార్డును ‘జైలర్ 2’ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. అంతేకాదు ఇప్పటి వరకు రూ. 1000 కోట్లు రాబట్టిన సినిమా ఏది తమిళంలో లేదు. ఆ రికార్డును ‘జైలర్ 2’ అధిగమిస్తుందా అనేది చూడాలి. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలు మాత్రమే ఈ ఫీట్‌ను అందుకున్నాయి. కానీ ఒక్క తమిళ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టలేదు. ‘జైలర్ 2’తో రజినీకాంత్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి మరి.
రూ. 580 కోట్ల గ్రాస్..
75 యేళ్ల వయసులో 'జైలర్-2' దాటికి పాత రికార్డులన్నీ తిరగరాస్తున్నాడు. రీజనల్ కేటగిరీ నుంచి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వరకు రజినీ మానియా థియేటర్లను ఊపేస్తోంది. జైలర్-2 కేవలం 7 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 580 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో ఎంటరైంది. మరో రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రజినీకాంత్ మార్క్ యాక్షన్, అనిరుధ్ అందించిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అగ్రతారల కామియో రోల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండటంతో రాబోయే రోజుల్లో 'జైలర్-2' మరిన్ని కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.