Dussehra Special Trains 2026: దసరా ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా స్పెషల్ ట్రైన్లు!
Dussehra Special Trains 2026: దసరా, దీపావళి పండుగలు దగ్గర పడుతున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సమయాల్లో రైళ్లు, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా 100 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
Dussehra Special Trains 2026: దసరా, దీపావళి పండుగలు కోసం.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను కలుపుతాయి. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు కూడా రైల్వే శాఖ వెల్లడించింది. చర్లపల్లి నుంచి నాగర్‌కోయిల్ వెళ్లే ప్రత్యేక రైలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్, తిరుచిరాపల్లి మీదుగా నాగర్‌కోయిల్ చేరుకుంటుంది.
అలాగే చర్లపల్లి-శ్రీకాకుళం ప్రత్యేక రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-చర్లపల్లి రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు నడుస్తుంది. ఈ సర్వీసులు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఆగుతాయి.
ఇక ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి ప్రత్యేక రైలు కూడా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనుంది. ఈ రైలు రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో ఆగుతుంది.
పండుగ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. అయితే రైలు తేదీలు, సమయాలు, టికెట్ లభ్యతను అధికారిక రైల్వే సమాచారం ద్వారా ముందుగా చెక్ చేసుకుని బుకింగ్ చేసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి