SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Savings Plan: ప్రతినెలా ఎంత ఆదా చేయవచ్చు? క్వాలా ఇంటెల్‌తో సులభతరం

Every Month Follow These 3 Saver Types: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఔత్సాహికులు నెలకు ఎంత ఆదా చేసుకోవచ్చనే విషయాన్ని తెలుసుకోండి. ఏఐ ఆధారిత క్వాలా ఇంటెల్‌ సహాయంతో స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవచ్చు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 02, 2026, 07:41 PM IST | Updated: Nov 02, 2026, 07:46 PM IST
Image Credit: Source: Gemini AI
Join

Stock Market Tips: పెట్టుబడులు పెట్టి నెలకు ఆదాయం సంపాదించాలనుకునే వారు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ప్రతి నెలా ఎంత ఆదా చేయాలి అనేది తెలుసుకుంటారు. ఈ 3 సేవర్ టైప్స్ ద్వారా ప్రొఫైల్‌ను అర్థం చేసుకుని.. ఏఐతో సరైన వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలనే అంశంపై 3 వేర్వేరు సేవర్ టైప్స్ గురించి తెలుసుకోవాలి. క్వాలా ఇంటెల్‌ ఏఐ టూల్ సహాయంతో స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టడం, ఆదా చేయడం నేర్చుకోండి. ఆర్థిక నిపుణులు, స్మార్ట్ ఏఐ ప్లాట్‌ఫారమ్ క్వాలా ఇంటెల్ ప్రజలను వారు డబ్బు ఆదా చేసే విధానాన్ని బట్టి 3 వేర్వేరు వర్గాలుగా విభజించింది.

ప్రతి నెలా మొదటి తారీఖున జీతం చేతికి రాగానే ప్రతి ఒక్కరి మనసులో 'ఈ నెల అసలు ఎంత డబ్బు ఆదా చేయాలి?' అనే ప్రశ్న మెదలుతుంది. దీనిపై కొందరు కొన్ని కొన్ని సలహాలు ఇస్తుంటారు. కొంతమంది స్నేహితులు జీతంలో సగం భాగం బ్యాంకులో వేయమని చెబితే, మరికొంతమంది లైఫ్ ఎంజాయ్ చేయడానికి అని, కొద్దిగా దాచుకుని మిగతాది ఖర్చు పెట్టమని చెబుతారు. కానీ నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరి జీవన విధానం, వారి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి.

ఆర్థిక నిపుణులు, స్మార్ట్ ఏఐ ప్లాట్‌ఫారమ్ క్వాలా ఇంటెల్‌ ప్రజలను డబ్బు ఆదా చేసే విధానం ఆధారంగా 3 వేర్వేరు వర్గాలుగా విభజించింది. మీరు ఏ రకమైన 'సేవర్' కిందకు వస్తారో.. ప్రతి నెలా ఎంత డబ్బు ఆదా చేయాలో సులభమైన భాషలో తెలుసుకుందాం.

డబ్బు ఆదా చేసేవారు 3 రకాలు - మీరు వీరిలో ఏ రకమైన వారు?
అగ్రెసివ్ సేవర్స్: 
భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. తాత్కాలిక ఆనందాల కంటే తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంపై వీరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. రాబోయే కాలంలో డబ్బు గురించిన ఆందోళన లేకుండా ఉండటానికి, వీలైనంత త్వరగా ఆర్థిక స్వతంత్రం పొందడానికి ప్రస్తుతం కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు.
ఎంత ఆదా చేయాలి: వీరు తమ సంపాదనలో 30 శాతం నుంచి 50 శాతం వరకు ఆదా చేసి.. ఎక్కువ లాభం వచ్చే చోట (కొంత రిస్క్ ఉన్నప్పటికీ) పెట్టుబడి పెడతారు.

మోడరేట్ సేవర్స్: సమతుల్యతతో జీవించేవారు
ఈ వర్గం వారు పిసినారి కాదు అలాగని విపరీతంగా ఖర్చు చేసేవారు కూడా కాదు. వీరు తమ దైనందిన జీవితాన్ని ఆనందంగా గడుపుతూనే.. పెద్ద పెద్ద కలల కోసం (సొంత ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల చదువుల ఖర్చులు లేదా కారు కొనుగోలు చేయడం వంటివి) డబ్బు కూడబెట్టుకుంటూ ఉంటారు.
ఎంత ఆదా చేయాలి: వీరు తమ సంపాదనలో 20 శాతం నుంచి 30 శాతం వరకు పక్కన పెట్టుకుంటారు.

లైఫ్‌స్టైల్-ఫోకస్డ్ సేవర్స్
ఈ వర్గం వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేవారు. వీళ్లు చాలా స్పష్టంగా ఉంటారు. మళ్లీ ఈ జీవితం తిరిగి రాదు అని ప్రస్తుత సమయాన్ని ఆనందంగా ఉండేలా ఉంటారు. ప్రస్తుత క్షణాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరు తమ దైనందిన జీవనశైలిలో పెద్దగా కోతలు (సేవింగ్స్‌) వేయరు. ఒక చిన్న అలవాటుగా కొంత డబ్బును ఆదా చేసుకుంటారు.
ఎంత ఆదా చేయాలి: వీరు తమ సంపాదనలో 10 శాతం నుంచి 15 శాతం వరకు ఆదా చేస్తారు. దీనివల్ల భవిష్యత్తు ప్రాథమిక అవసరాలు తీరుతాయి. నేటి ఆనందం కూడా తగ్గదు.

క్వాలా ఇంటెల్‌తో స్మార్ట్ సేవింగ్స్
క్వాలా ఇంటెల్‌ని ట్రై చేయండి: https://kwalaintel.com/in/

అన్‌లిమిటెడ్ ఏఐ స్టాక్, రిటైర్మెంట్ రీసెర్చ్: కేవలం రూ.1000 నెలకి!

మీ ప్రొఫైల్ ఏమిటి? మీ అంతట మీరే ఇలా గుర్తించండి
క్వాలా ఇంటెల్‌ స్మార్ట్ ఏఐ ప్లాట్‌ఫారమ్ మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగమని సూచిస్తుంది. దీని ద్వారా మీరు ఏ కేటగిరీకి చెందుతారో మీకు అర్థమవుతుంది:

మీ కల త్వరగా రిటైరై హాయిగా జీవితాన్ని గడపడమేనా? (అయితే మీరు అగ్రెసివ్)

రాబోయే 3-5 సంవత్సరాలలో ఇల్లు లేదా కారు లాంటి పెద్ద వస్తువు ఏదైనా కొనుగోలు చేయాలన్నది మీ లక్ష్యమా? (అయితే మీరు మోడరేట్)

నేటి సౌకర్యాలు, ఖర్చులతో ఎటువంటి రాజీ పడకుండా కేవలం సేఫ్‌గా ఉండాలనుకుంటున్నారా? (అయితే మీరు లైఫ్‌స్టైల్-ఫోకస్డ్)

డబ్బును సరైన చోట ఎలా పెట్టుబడి పెట్టాలి?
క్వాలా ఇంటెల్‌ ఇచ్చే సలహా ఏమిటంటే మొదట మీ అప్పులన్నీ (క్రెడిట్ కార్డ్ బిల్లు లేదా లోన్ వంటివి) తీర్చండి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర సమయాల కోసం డబ్బు) పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీ కేటగిరీని బట్టి డబ్బును ఈ కింది విధంగా విభజించండి

అగ్రెసివ్ వారు: 80 శాతం డబ్బును షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ (ఈక్విటీ)లో, 20 శాతం సురక్షితమైన ప్రదేశంలో (డెట్) పెట్టుబడి పెట్టండి.

మోడరేట్ వారు: 60 శాతం ఈక్విటీలో, 40 శాతం సురక్షితమైన ప్రదేశాలలో పెట్టుబడి పెట్టండి.

లైఫ్‌స్టైల్ వారు: 30 శాతం ఈక్విటీలో, 70 శాతం సురక్షితమైన ప్రదేశాలలో లేదా బ్యాంకులో ఉంచండి.

గమనిక: కొద్ది సంవత్సరాలలోనే డబ్బు అవసరం ఉంటే మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టకండి. దానిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి!

ద్రవ్యోల్బణం నుంచి రక్షణ ఎలా?
రూ.100కి దొరికే వస్తువు రేపు మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. మీ వద్ద ఉన్న డబ్బు అంతటినీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంచితే ద్రవ్యోల్బణం మీ డబ్బు విలువను క్రక్రమేణా తగ్గించేస్తుంది. క్వాలా ఇంటెల్‌ వంటి స్మార్ట్ టెక్నాలజీ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం కొంత రిస్క్ తీసుకొని సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని చెబుతోంది. అప్పుడే ద్రవ్యోల్బణం పెరిగే వేగంతో పాటు మీ డబ్బు విలువ కూడా పెరుగుతుంది.

ఇకపై ఏమి చేయాలి?
డబ్బు ఆదా చేయడానికి.. దానిని సరైన చోట వృద్ధి చేయడానికి ఒకే ఫార్ములా అందరికీ సరిపోదు. మీ సంపాదన, ఖర్చు చేసే విధానం, మీ కలలను పరిశీలించి, ఇప్పుడే మీ సేవింగ్స్ కోసం సరైన ప్రణాళికను ప్రారంభించండి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES