• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

Wonderla: వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ తన రెండో త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. కొత్తగా వచ్చిన చెన్నై పార్క్‌తోపాటు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ పార్కులకు సందర్శకుల తాకిడి పెరగడంతో సంస్థ హిస్టరీలోనే అత్యుత్తమ త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 07:44 PM IST|Updated: Nov 02, 2026, 07:47 PM IST
joinshare
వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?
Image Credit: Wonderla Holidays (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Railway Coach Colour Codes: భారతీయ రైల్వేలో రంగురంగుల బోగీలు..ఎరుపు, నీలం, ఆకుపచ్చ పెట్టెల రహస్యం ఏంటో ఇదే!

Railway Coach Colour Codes: భారతీయ రైల్వేలో రంగురంగుల బోగీలు..ఎరుపు, నీలం, ఆకుపచ్చ పెట్టెల రహస్యం ఏంటో ఇదే!

2

School Holiday Tomorrow: రేపు విద్యాసంస్థలకు సెలవు.. తుఫాను ముప్పుతో ప్రభుత్వం కీలక నిర్ణయం!

3

వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?

4

Savings Plan: ప్రతినెలా ఎంత ఆదా చేయవచ్చు? క్వాలా ఇంటెల్‌తో సులభతరం

5

GVMC Elections: జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై గందరగోళం.. 89 వేల ఓట్లు ఎలా పెరిగాయి..? వైసీపీ ఆరోపణలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Wonderla: దేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల నిర్వహణ సంస్థ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్  మరోసారి తన సత్తా చాటింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత ఉత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ మొత్తం ఆదాయం 42 శాతం పెరిగి రూ.126 కోట్లకు చేరింది. EBITDA ఏకంగా 90 శాతం వృద్ధి చెంది రూ.30.11 కోట్లుగా నమోదైంది. సందర్శకుల సంఖ్య పెరగడం, చెన్నై పార్క్ నుంచి వచ్చిన ఆదాయం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్కుల మెరుగైన పనితీరు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

2026 సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన తొలి ఆరు నెలల కాలంలోనూ మంచి ఫలితాలు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.377.78 కోట్లకు చేరుకుంది. EBITDA గత ఏడాదితో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.152.10 కోట్లుగా నమోదైంది. ఆరు నెలల్లో వండర్‌లా పార్కులను సందర్శించిన వారి సంఖ్య 19.50 లక్షలకు చేరగా.. గత ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం.
పార్కుల వారీగా సందర్శకుల వివరాలు..

  • బెంగళూరు: 2.13 లక్షలు
  • కొచ్చి: 2.02 లక్షలు
  • చెన్నై: 1.90 లక్షలు
  • హైదరాబాద్: 99 వేలు
  • భువనేశ్వర్: 20 వేలు

మొత్తంగా ఈ మూడు నెలల్లో 7.25 లక్షల మంది వండర్‌లా పార్కులను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సందర్శకుల సంఖ్య 44 శాతం పెరిగింది. వండరలా వృద్ధిలో చెన్నై పార్క్ కీలక పాత్ర పోషించింది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఆరు నెలల్లోనే ఈ పార్క్ ద్వారా రూ.73 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో 4.32 లక్షల మంది సందర్శకులు చెన్నై పార్కును సందర్శించారు. ఒక్క రెండో త్రైమాసికంలోనే 1.90 లక్షల మంది రాగా.. సుమారు రూ.28 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, భువనేశ్వర్‌లోని ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్కులు కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. రెండో త్రైమాసికంలో ఈ పార్కుల ఆదాయం సుమారు 8 శాతం పెరిగింది. సందర్శకుల సంఖ్యలో 6 శాతం, ఒక్కో సందర్శకుడి నుంచి వచ్చే సగటు ఆదాయంలో 2 శాతం వృద్ధి నమోదైంది.

కంపెనీ పనితీరుపై వండర్‌లా హాలీడేస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ.. రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు సంస్థకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఆదాయం 42 శాతం పెరగడంతో పాటు EBITDA దాదాపు రెట్టింపు కావడం, మార్జిన్లు మెరుగుపడటం కంపెనీ వృద్ధికి నిదర్శనమన్నారు. చెన్నై పార్క్ తొలి ఆరు నెలల్లోనే రూ.73 కోట్ల ఆదాయాన్ని అందించిందని.. మరోవైపు ఇప్పటికే ఉన్న పార్కులు కూడా సొంతంగా మంచి వృద్ధిని సాధిస్తున్నాయన్నారు. తొలి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.378 కోట్లకు, EBITDA రూ.152 కోట్లకు చేరడం సంతోషంగా ఉందన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News