Gold Price Prediction: 2027లో భారీగా పెరగనున్న బంగారం ధరలు.. గోల్డ్ రేట్లు ఎంతకు చేరుతాయో తెలుసా?
Gold Price Prediction 2027: రాబోయే ఏళ్లలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉంది అని ప్రముఖ అమెరికన్ ఆర్థిక సంస్థలు జేపీ మోర్గాన్, జెఫరీస్ అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం పసిడి ధరల పరుగుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. జేపీ మోర్గాన్ విశ్లేషణ ప్రకారం 2027 మధ్య నాటికి ఔన్సు (28.3495 గ్రాములు) బంగారం ధర రూ.4,79,677 (అంటే గ్రాము బంగారం రూ. 16,920)కి చేరుతుందని భావిస్తున్నారు.
Gold Price Prediction 2027: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకుంటాయని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. వీరి అంచనాల ఆధారంగా, 2026 చివరి నాటికి ఔన్సు (28.3495 గ్రాములు) బంగారం ధర రూ.4,31,710 కు చేరుకుని, 2027 మధ్య నాటికి ఏకంగా రూ. రూ.4,79,677 (అంటే గ్రాము బంగారం రూ. 16,920)స్థాయికి అందుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
అంతేకాకుండా, జెఫరీస్ సంస్థకు చెందిన 'గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ' క్రిస్ వుడ్ మాట్లాడుతూ, అమెరికన్ డాలర్ విలువ పడిపోయే క్రమంలో పసిడి ధరలు ప్రస్తుత స్థాయి నుంచి 130 శాతం పెరిగి గ్రాము బంగారం రూ.33,840కి పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
పసిడి ధరల్లో దీర్ఘకాలిక పెరుగుదలకు అనేక అంతర్జాతీయ పరిణామాలు దోహదపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా యుద్ధ భయాలు ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి పెట్టుబడులు పెడతారు. చైనా వంటి బహుళ దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
డాలర్ క్షీణత & యూఎస్ రుణాలు..
అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటం, బలహీనమైన యూఎస్ కార్మిక మార్కెట్ గణాంకాలు, పెరుగుతున్న యూఎస్ ప్రభుత్వ రుణాల గురించిన ఆందోళనలు దీర్ఘకాలిక బంగారు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
భారతీయ మార్కెట్‌పై ప్రభావం
ఆగస్టు నెలలో అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, సెప్టెంబర్‌లో ప్రపంచ మార్కెట్‌లో 3.9%, భారత మార్కెట్‌లో 4.6% తగ్గుదల నమోదైంది. తాజా వివరాల ప్రకారం కామెక్స్ (COMEX) మార్కెట్‌లో గ్రాము బంగారం ధర రూ.14,889 వద్ద కొనసాగుతుండగా, భారతదేశంలో మల్టీ - కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్‌లో 10 గ్రాముల 24 - క్యారెట్ బంగారం ధర రూ. 15,426 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే భారత మార్కెట్‌లోనూ బంగారం మరింత ప్రియం కానున్నాయి. అయితే ఇక్కడ డాలర్‌తో రూపాయి మారకం విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పసిడిలో పెట్టుబడి పెట్టే ముందు కేవలం అంచనాలపైనే ఆధారపడకుండా మార్కెట్ రిస్క్‌లను మరియు సొంత ఆర్థిక స్థితిని పరిశీలించుకోవడం శ్రేయస్కరం.
(గమనిక: ఈ వార్తలో ప్రచురించిన సమాచారం కేవలం ఓ అంతర్జాతీయ నివేదిక ఆధారంగా పొందుపరిచినది. మార్కెట్లో పెట్టుబడి అనేది ఎంతో రిస్క్‌తో కూడిన విషయం. దీన్ని పాటించే ముందు సంబంధింత మార్కెట్ నిపుణుడి సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం మేలు. అయితే జీ తెలుగు న్యూస్ ఎలాంటి పెట్టుబడులు లేదా మరే ఇతర వ్యాపకాన్ని ఇక్కడ ప్రోత్సహించడం లేదు.)
Also Read: యాపిల్ ఐఫోన్ 18 సంచలనం..మడతబెట్టే ఐఫోన్ వచ్చేసింది..ఒక్కోటి రూ.3 లక్షలు మాత్రమే!
Also Read: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్తరూల్స్..ఎన్నిసార్లు విత్‌డ్రా చేయోచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook