మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధర.. సెప్టెంబర్ 22వ తేదీ ధరలివే..!!
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. తులం 10గ్రాముల బంగారం ధర రూ. 1260 మేర దిగివచ్చింది. క్రూడాయిల్ ధరలు కూడా తగ్గాయి. బాండ్ ఈల్ట్స్ గిరాకీ పెరగడంతో బంగారం ధరలు పడిపోతున్నాయి. వెండి ధర మాత్రం గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంది. ఈ క్రమంలో నేడు సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు ఇది శుభవార్త. దేశీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధరలు రూ. 3,000 మేర పెరిగి ఆందోళన కలిగించిన విషయం గమనార్హం. అయితే, ఈరోజు ధరలు ఒక్కసారిగా పడిపోయి. భారీ వ్యత్యాసాన్ని సృష్టించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్ విలువ, బాండ్ల రాబడులు పెరగడం వంటి పలు అంశాలు బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల తగ్గుదల దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 22న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,260 మేర తగ్గింది. దీంతో గోల్డ్ రేట్ రూ. 1,54,580కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,150 తగ్గి రూ. 1,41,700 కు చేరింది. కిలో వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఇది కిలోకు రూ. 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరలు:
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ వంటి బులియన్ మార్కెట్లలో కూడా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,150 తగ్గి రూ. 1,41,700 కు చేరింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,260 తగ్గి కిలోకు రూ. 1,52,580 కు చేరింది. వెండి కిలోకు రూ. 2,60,000 వద్ద అమ్ముడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుతున్నాయి. ఈ రోజు, స్పాట్ బంగారం ధర ఔన్సుకు $22 తగ్గింది. ఫలితంగా, ఒక ఔన్సు బంగారం ధర $4354కు పడిపోయింది. అయితే, వెండి ధర స్వల్పంగా పెరిగి, 0.39 శాతం వృద్ధితో ఔన్సుకు $66.35కు చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి