Honda Rebel 500: హోండా నుంచి మరో అదిరిపోయే బైక్.. రూ.4.90 లక్షలతో అ'ధర'హో!
Honda Rebel 500 Launched In India: మధ్య తరగతి ప్రజలకు అత్యంత అందుబాటు ధరల్లో బైక్‌లు అందించే ఆటోమొబైల్ సంస్థ హోండా అత్యంత విలాసవంతమైన బైక్‌ను విడుదల చేసింది. క్లచ్ లేకుండా గేర్లు మార్చే వ్యవస్థతో కూడిన క్రూయిజ్ బైక్‌ను ఆవిష్కరించింది. కొత్త క్రూయిజర్ బైక్ ఫీచర్లు, ధర ఎంతనో తెలుసుకుందాం.
Honda Rebel 500 Features And Price: అత్యధిక బైక్‌లను విక్రయించే ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా భారతదేశ మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. కొత్త క్రూయిజర్ బైక్ రెబెల్ 500ను విడుదల చేయగా.. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. క్లచ్ లేకుండానే గేర్లు మార్చుకునే సదుపాయం ఉంది. గతంలో విదేశాల్లో తయారుచేసిన ఈ బైక్‌ను తొలిసారి దేశీయంగా తయారు చేసి విడుదల చేసింది. హోండా రెబెల్ 500 స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.50 లక్షలు ఉండగా.. ఈ-క్లచ్ వేరియంట్ ధర రూ.4.90 లక్షలుగా ప్రకటించింది.
బుకింగ్ ఎలానో తెలుసా?
హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లలో కూడా బుకింగ్స్ ప్రారంభమవగా.. హోండా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. అయితే బుక్ చేసుకున్న వారికి బైక్‌లు ఎప్పుడూ డెలివరీ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు.
హోండా రెబెల్ 500 ప్రత్యేకతలు
ఈ బైక్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. సీకేడీ విధానంలో విడిభాగాలను భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడే అసెంబుల్ చేస్తారు. వీటిలో దాదాపు 50 శాతం విడిభాగాలను దేశీయ తయారీదారుల నుంచే సేకరిస్తున్నారు. ఇంజిన్ ఒక్కటే విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా తయారుచేయడంతోనే బైక్ ధర తగ్గింది. గతంలో మోడల్ ధర రూ.5.12 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.4.50 లక్షలకు తగ్గింది.
అత్యాధునిక ఫీచర్లు
హోండా రెబెల్ 500లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్
టీఎఫ్‌టీ డిస్‌ప్లే
హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ
టర్న్ బై టర్న్ నావిగేషన్
భద్రతా ఫీచర్లు
సేఫ్టీ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్
హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టమ్
ఈ-క్లచ్ ప్రత్యేకత
హోండా రెబెల్ 500లో మరో అద్భుతమైన ఫీచర్ ఇ-క్లచ్ టెక్నాలజీ. బైక్ నడిపేటప్పుడు గేర్లు మార్చడానికి క్లచ్ లివర్‌ను ఉపయోగిస్తాం. కొత్తగా తీసుకువచ్చిన ఇ-క్లచ్ సిస్టమ్‌లో క్లచ్ లివర్‌ను నొక్కకుండానే బైక్‌ను ప్రారంభించచ్చు, ఆపవచ్చు, గేర్లు మార్చుకోవచ్చు. ఈ క్లచ్ విధానంతో రైడర్లకు రెండు విధాలుగా బైక్ నడిపే సౌకర్యం లభిస్తుంది.
ఏ రంగుల్లో..
హోండా రెబెల్ 500 రెండు రంగుల్లో లభిస్తోంది. మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.
ఇంజిన్, పవర్
హోండా రెబెల్ 500లో 471 సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్
ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 45.4 బీహెచ్‌పీ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 43.3 ఎన్ఎం టార్క్
6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్
డిజైన్, బరువు
ఈ బైక్‌ను తక్కువ ఎత్తు ఉన్నవారు సులభంగా నడిపే అవకాశం ఉంది. ఎందుకంటే బైక్ సీటు ఎత్తు 690 ఎంఎం మాత్రమే.
బరువు
191 కిలోలు
టైర్ల సైజ్‌లు
ముందు 130/90-16
వెనుక 150/80-16
500సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్