SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Honor 600 Elite 5G లాంచ్.. 8100mAh బ్యాటరీ, 108MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!

Honor 600 Elite 5g: అందరూ ఎంతో ఎదురు చూస్తున్న Honor 600 Elite 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 21, 2026, 01:15 PM IST | Updated: Sep 21, 2026, 01:18 PM IST
Image Credit: Honor 600 Elite 5G లాంచ్.. 8100mAh బ్యాటరీ, 108MP కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు!
Join

Honor 600 Elite 5g Telugu News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ హానర్ మార్కెట్‌లోకి తమ కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. కంపెనీ హానర్ 600 ఎలైట్ 5G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో హై-రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు చాలా అద్భుతమైన  స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో ఇది అందుబాటులోకి రావడం విశేషం.. ఇది 8GB ర్యామ్‌తో పాటు అద్భుతమైన స్టోరేజ్‌ను కూడా కలిగి ఉన్నట్లు  తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హానర్ 600 ఎలైట్ 5G ధర..
హానర్ 600 ఎలైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇంకా ఈ మొబైల్‌కి సంబంధించిన ధరలను కంపెనీ ప్రకటించలేదు.. ఈ ఫోన్ డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్‌తో పాటు మెటియోర్ సిల్వర్‌తో అద్భుతమైన కలర్‌ ఆప్షన్స్‌లో విడుదలైంది.. ఈ ఫోన్ ప్రస్తుతం ఒకే 8GB ర్యామ్‌తో పాటు 256GB వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. కంపెనీ త్వరలో ఇతర మార్కెట్లలో దీనిని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ హానర్ 600 ఎలైట్ స్మార్ట్‌ఫోన్‌ 5G 1592 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.87-అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 1,020 నిట్స్ వరకు HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది..

ఇక Honor 600 Elite 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది ఫోన్‌లో 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.. ఒక సెకండరీ లెన్స్ కూడా అందుబాటులో ఉంచింది.. సెల్ఫీల కోసం.. ఈ ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఇందులో కంపెనీ అనేక AI ఫీచర్లకు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.  

హానర్ 600 ఎలైట్ 5G ఈ ఫోన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ 8,100mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 45W హానర్ సూపర్‌ఛార్జ్‌కు సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఈ ఫోన్ బ్యాటరీ 6 సంవత్సరాల వరకు పనిచేస్తుందని.. అద్భుతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. ఇవే కాకుండా చాలా రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండడం విశేషం..
 

Also Read: OPPO A7 Pro ఫోన్‌ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో అదరగొట్టిన..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES