ITC Cigarette Price Hike: సిగరెట్ వినియోగదారులకు బ్లాస్టింగ్ న్యూస్..భారీగా పెరిగిన MRP ధరలు..
ITC Cigarette Price Hike News: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ (ITC) తన ప్రముఖ సిగరెట్ బ్రాండ్ల ధరలను మరోసారి పెంచింది. 2026లో అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానం, జీఎస్‌టీ ప్రభావం కారణంగా కంపెనీ దశలవారీగా ఈ ధరల పెంపును చేపడుతోంది. తాజా సవరణతో ప్రీమియం, స్టార్ సిగరెట్ల ధరలు భారీగా పెంచేసింది. దీంతో కొత్త ధరల (MRP)తో కూడిన ప్యాక్‌లు ఇప్పటికే మార్కెట్ పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశించాయి.
ITC Cigarette Price Hike News: ప్రముఖ సిగరెట్ల తయారీ సంస్థ ఐటీసీ తన ప్రసిద్ధ బ్రాండ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీలర్ల సమాచారం ప్రకారం.. 10 సిగరెట్లు ఉండే 'గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం' (Gold Flake Premium) ప్యాక్ ధర గతంలో ఉన్న రూ. 125 నుండి రూ. 135కి పెరిగింది. ఈ ఒక్క సవరణలోనే ధర 8 శాతం పెరిగింది. 2026 జూన్ నెలలో దీని ధర రూ. 115 నుండి రూ. 125కి పెరగ్గా, ఏడాది ప్రారంభం నుండి రూ. 115 నుండి రూ. 135కి చేరడం ద్వారా మొత్తంమీద 17.4 శాతం పెంపు నమోదైంది.
దీంతో పాటు ఇతర ప్రముఖ బ్రాండ్ల ధరలలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. క్లాసిక్ కనెక్ట్ (20 సిగరెట్లు) పాత ధర రూ. 390 నుండి రూ. 38 (9.74%) పెరిగి, కొత్త ఎంఆర్‌పీ రూ. 428కి చేరింది. ఫిబ్రవరి 2026కి ముందు రూ. 300గా ఉన్న ఈ ప్యాక్ ధర దశలవారీగా రూ. 360, రూ. 390 మీదుగా రూ. 428కి చేరి మొత్తం 42.7% (రూ. 128) పెరుగుదల నమోదు చేసింది.
గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ (10 సిగరెట్లు): పాత ధర రూ. 79 నుండి రూ. 10 (12.66%) పెరిగి, కొత్త ఎంఆర్‌పీ రూ.89గా మారింది. ఫిబ్రవరికి ముందు రూ. 59గా ఉన్న ఈ ప్యాక్ ధర రూ. 70, రూ. 79ల మీదుగా రూ. 89కి పెరిగి మొత్తం 50.8% (రూ. 30) పెరుగుదలను నమోదు చేసింది.
ధరల పెంపునకు ప్రధాన కారణాలు..
ఫిబ్రవరి 1, 2026 నుండి సిగరెట్లపై 40% జీఎస్‌టీతో పాటు కొత్త ఎక్సైజ్ సుంకాలు విధించడం వల్ల భారీగా పన్ను భారం పడింది. ఈ పన్ను భారాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా సవరించే వ్యూహాన్ని ఐటీసీ అనుసరిస్తోంది. ఒకేసారి భారీగా ధరలు పెంచితే వినియోగదారులు అక్రమ లేదా చౌక ఉత్పత్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని, కొనుగోలుదారుల ఆదరణను కాపాడుతూనే పన్ను భారాన్ని భరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న ధరలు డీలర్ల వద్ద సేకరించిన సమాచారం, కంపెనీ ప్రకటనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ధరల మార్పుల సమయంలో ప్యాక్, ప్రాంతం, స్టాక్ లభ్యతను బట్టి MRPలు మారవచ్చు.)