Jio 3-In-1 Home Pack: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్..ఒకే రీఛార్జ్‌పై 1000 టీవీ ఛానళ్లు, 12 ఓటీటీలు ఉచితం!
Jio 3-In-1 Home Pack Offer: దసరా పండుగ సందర్భంగా రిలయన్స్ జియో తన ఫైబర్, ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం 'జియో హోమ్ 3-ఇన్-1' అనే నూతన ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఒకే రీఛార్జ్‌తో అపరిమిత వై-ఫై ఇంటర్నెట్, 1000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లు, 12కు పైగా ప్రముఖ ఓటీటీ యాప్‌ల సేవలను పొందవచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక వై-ఫై, టీవీ ప్యాక్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Jio 3-In-1 Home Pack Offer: పండగ సీజన్‌లో వినియోగదారుల ఇంటర్నెట్, వినోద అవసరాలను ఒకే ప్లాన్ కిందకు తీసుకురావడానికి జియో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ ఖాతాదారులందరికీ ఈ 3-ఇన్-1 ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్‌లిమిటెడ్ వై-ఫైతో పాటు 1000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లు, 12 కంటే ఎక్కువ పాపులర్ ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను కస్టమర్లు అస్వాదించవచ్చు.
100 Mbps స్పీడ్ ప్లాన్..
ఈ ప్లాన్‌లో రెండు నెలల వ్యాలిడిటీతో రూ. 2,122 చెల్లిస్తే, మూడో నెల సేవలు ఉచితంగా లభిస్తాయి. దీనివల్ల కస్టమర్లకు నెలవారీ సగటున రూ. 707 మాత్రమే ఖర్చవుతుంది.
30 Mbps స్పీడ్ ప్లాన్..
ఈ రీఛార్జ్ ప్లాన్ కింద 3 నెలల కాలపరిమితికి దీని ధర రూ. 2,222 గా నిర్ణయించారు. ఇందులో ఒక నెల ఉచిత వాలిడిటీతో పాటు 90 రోజుల పాటు వినియోగించుకునేలా 100 GB అదనపు డేటా కూడా ఇస్తున్నారు. ఈ ప్లాన్ ద్వారా నెలకు సగటున రూ. 555 ఖర్చు అవుతుంది.
ఈ రెండు ప్లాన్లలోనూ ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అంతేకాకుండా 3, 6, లేదా 12 నెలల అడ్వాన్స్ పేమెంట్ చేసే వారికి లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారే వినియోగదారులకు అదనంగా 7 రోజుల ఉచిత వాలిడిటీ ఇస్తున్నారు.
ప్రత్యేక టీవీ, వై-ఫై ప్యాక్‌లు..
కేవలం టీవీ ప్రసారాలనే కోరుకునే వారి కోసం రూ. 2,000 ధరకు 5 నెలల టీవీ ప్యాక్‌ను పరిచయం చేశారు. దీని ద్వారా సగటున నెలకు రూ. 400 ఖర్చవుతుంది. ఈ ప్యాక్‌లో 15 కంటే ఎక్కువ ప్రాంతీయ భాషల్లో 200 పైగా హెచ్‌డీ ఛానెళ్లు, 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు ఉంటాయి. అలాగే, రెండు నెలల టీవీ ప్యాక్ ధర రూ. 1,000 కాగా, అదనంగా చెల్లించే రూ. 200 సెటప్ ఫీజును నాలుగు రూ. 50 కూపన్ల రూపంలో రీఫండ్ చేస్తారు.
అలాగే కేవలం వై-ఫై డేటా కావాలనుకునే వారికి 100 Mbps వేగంతో 5 నెలల ప్యాక్ రూ. 3,000 కి, 2 నెలల ప్యాక్ రూ. 1,500 కి లభిస్తుంది. 30 Mbps స్పీడ్‌తో 5 నెలల వై-ఫై ప్యాక్ ధర రూ. 2,200 గా ఉంది.
డేటా పరిమితి, నిబంధనలు (FUP)..
ఈ ప్లాన్లలో జియో ఫైబర్ యూజర్లకు నెలకు 3,300 GB డేటా పరిమితి (FUP) ఉండగా, ఎయిర్‌ఫైబర్ యూజర్లకు నెలకు 1,000 GB డేటా పరిమితి వర్తిస్తుంది. నిర్ణీత డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్లకు పైగా కుటుంబాలు జియో హోమ్ సేవలను వినియోగిస్తున్నాయి.