SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nita Ambani Necklace: వినాయక ఉత్సవాల్లో మెరిసిన నీతా అంబానీ.. ఆమె నెక్లెస్‌ ఖరీదు ఎంతో తెలుసా?

Nita Ambani Necklace Cost: భారతదేశ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ నివాసం ఆంటిలాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం ఎంతో వైభవంగా జరగ్గా.. ఈ వేడుకల్లో ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన నెక్లెస్‌ విలువ ఎంతో తెలుసుకుందాం.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 11:25 PM IST | Updated: Sep 21, 2026, 11:29 PM IST
Image Credit: Nita Ambani Necklace Cost
Join

Nita Ambani Necklace Cost: వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. గణేశ్‌ ఉత్సవాలను ఎంతో వైభవంగా అంబానీ కుటుంబసభ్యులు చేసుకోగా.. ఆ వేడుకల్లో నీతా అంబానీ తళుక్కున మెరిశారు. ఆకుపచ్చ రంగు చీరలో.. ఆ రంగుకు తగ్గట్టు ఆభరణాలు.. ఇతరత్రా అలంకరణ ఆమె చేసుకున్నారు. అయితే అందరి దృష్టి ఆమె ధరించిన నెక్లెస్‌తోపాటు చీరపై పడింది. వాటి విలువ ఎంతో ఉందో తెలుసుకుందాం.

గణేష్ నవరాత్రుల సందర్భంగా ముంబైలోని తమ నివాసంలో ముకేశ్‌ అంబానీ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల అనంతరం వినాయక నిమజ్జనం ఎంతో ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు. ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం అంటిలియాలో ప్రతి సంవత్సరం ఏడాది మాదిరి ఈ సంవత్సరం వైభవంగా గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఈసారి నీతా అంబానీ సాంప్రదాయంతోపాటు రాజసం ఉట్టిపడేలా ఆమె అందంగా తయారయ్యారు.

గణేశ్‌ నిమజ్జనంలో నీతా అంబానీ ఆకుపచ్చ బనారసి చీరలో కనిపించారు. చీరకు తగ్గట్టు ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి.. తలలో తెల్లటి పూల గజరా పెట్టుకున్నారు. సాంప్రదాయ బొట్టు, సింధూరం, అలంకరణ ఆమెకు మరింత కళను తీసుకువచ్చాయి. సాంప్రదాయ చేనేత.. వెడల్పుగా ఉన్న వెండి అంచుతో చీర వారి రాజసం ఉట్టిపడేలా ఉంది. సాంప్రదాయ సౌందర్యానికి ఆమె ప్రాధాన్యమిచ్చినట్టు ఆమె వస్త్రధారణ చెబుతోంది.

ఇక ఈ ఉత్సవంలో నీతా అంబానీ ధరించిన ప్రత్యేకమైన నెక్లెస్‌పై అందరి దృష్టి పడింది. వజ్రాలు, పచ్చలతో అలంకరించిన ఆ నెక్లెస్ మధ్యలో వినాయకుడి లాకెట్టు ఉంది. గణేశుడి ప్రతిమను వజ్రాలు, పచ్చలతో తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఇక మిగతా నెక్లెస్‌ను చిన్న చిన్న విలువైన రాళ్లతో అలంకరించారు. విలాసవంతమైన ఆభరణాల డిజైన్‌తోపాటు ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఈ నెక్లెస్ ఉంది. ఈ ప్రత్యేకమైన నెక్లెస్ ధర ఎంత అనేది స్పష్టంగా తెలియడం లేదు.

కానీ నీతా అంబానీ ధరించిన గణనాథుడితో కూడిన నెక్లెస్‌ విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే నెక్లెస్‌లో ఉపయోగించిన వజ్రాలు, పచ్చలు అత్యంత నాణ్యత కలిగినవని.. వాటి పరిమాణం, డిజైన్, హస్తకళా నైపుణ్యం వంటివి అన్నీ లెక్కలు వేసుకుంటే అంతటి ధర ఉంటుందని జ్యువెలరీ వర్గాల వారు చెబుతున్నారు. నెక్లెస్‌లో అదనపు ఆకర్షణ గణేశ్‌ లాకెట్‌. దీనికి ఉపయోగించిన విలువైన రాళ్ల నాణ్యత, బరువు ధర ఎక్కువ ఉండడానికి కారణంగా తెలుస్తోంది. కాగా వినాయక చవితి రోజు అంబానీ కుటుంబంలో జరిగిన పూజా కార్యక్రమానికి సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్‌ నటీనటులు అందరూ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES