SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

115 అంగుళాల భారీ స్మార్ట్ టీవీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

LG TV Price India 2026: ఎల్‌జీ ఇండియా 115 అంగుళాల QNED evo AI Mini LED స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ భారీ టీవీ ధరను రూ.15 లక్షలుగా నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 02, 2026, 06:41 PM IST | Updated: Nov 02, 2026, 06:43 PM IST
Join

LG TV Price India 2026: ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలనుకునే వారి కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ  సరికొత్త భారీ స్మార్ట్ టీవీని భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏకంగా 115 అంగుళాల స్క్రీన్‌తో రూపొందించిన QNED evo AI Mini LED టీవీని లాంచ్ చేసింది. అత్యాధునిక AI టెక్నాలజీ, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, పవర్‌ఫుల్ సౌండ్, గేమింగ్ ఫీచర్లతో ఈ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా భారీ స్క్రీన్‌పై సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, వీడియో గేమ్స్ చూసే వారికి సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఎల్‌జీ ఈ టీవీని రూపొందించింది. అయితే దీని ధర మాత్రం సామాన్యులకు అందనంత స్థాయిలో ఉంది. ఈ టీవీ ధరను దాదాపు రూ.15 లక్షలుగా నిర్ణయించింది. 2026 QNED evo సిరీస్‌లో ఇదే అతిపెద్ద టీవీ కావడం విశేషం.

ఈ టీవీలో Alpha 8 AI Processor Gen3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mini LED డిస్‌ప్లే, Precision Dimming Ultra, Dynamic QNED Color Pro టెక్నాలజీలతో మెరుగైన పిక్చర్ క్వాలిటీ అందించనుంది. Intertek సంస్థ నుంచి 100 శాతం Colour Volume సర్టిఫికేషన్ కూడా పొందింది. AI Super Upscaling ఫీచర్ ద్వారా వీడియోల నాణ్యతను 4K స్థాయికి మెరుగుపరుస్తుంది. సినిమాలు, క్రీడలు చూసేవారితో పాటు గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఇందులో ప్రత్యేక ఫీచర్లు ఇచ్చారు. AI Sound Pro ద్వారా వర్చువల్ 11.1.2 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. గేమింగ్ కోసం 165Hz VRR, AMD FreeSync Premium, Auto Low Latency Mode ఉన్నాయి. Motion Booster సాయంతో రిఫ్రెష్ రేట్ 330Hz వరకు అందుబాటులో ఉంటుంది.

ఇక webOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో Google Gemini, Microsoft Copilot ఆధారిత AI ఫీచర్లు కూడా ఉన్నాయి. Voice ID, AI Concierge వంటి సదుపాయాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ధర విషయానికి వస్తే.. LG 115QNED90BL మోడల్ డీపీ ధరను రూ.14,99,990గా కంపెనీ ప్రకటించింది. భారీ స్క్రీన్, అధునాతన డిస్‌ప్లే టెక్నాలజీతో వచ్చిన ఈ టీవీ ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో పెద్ద స్క్రీన్ టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎల్‌జీ తన ప్రీమియం టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇంట్లోనే థియేటర్ అనుభూతిని కోరుకునే వారు, క్రీడాభిమానులు, గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఈ 115 అంగుళాల QNED evo AI Mini LED TVని తీసుకొచ్చింది. అయితే దాదాపు రూ.15 లక్షల ధర ఉండటంతో ఇది ప్రధానంగా లగ్జరీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES