SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

LPG Subsidy: అక్టోబర్ 1 నుంచి ఎల్పీజీ నిబంధనలు.. ఇది చేయకపోతే భారీ నష్టం

LPG Cylinder New Rules From October 1st Do This: కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీకి సంబంధించి కీలక మార్పులు తీసుకురాబోతున్నది. కొత్త నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుండడంతో వినియోగదారులు అప్రమత్తం కావాల్సి ఉంది. ముఖ్యంగా రాయితీ పొందుతున్న లబ్ధిదారులు మాత్రం ఈ పని చేయకపోతే సబ్సిడీ రద్దయ్యే అవకాశం ఉంది.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 11:45 PM IST | Updated: Sep 21, 2026, 11:50 PM IST
Image Credit: LPG Cylinder
Join

LPG Cylinder Refill: వంట గ్యాస్‌ (ఎల్పీజీ)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్‌ వినియోగిస్తున్న వినియోగదారులకు సంబంధించి కీలక అప్‌డేట్‌ చేసింది. ఎల్పీజీ సిలిండర్‌పై రాయితీ పొందుతున్న లబ్ధిదారులకు కీలక సూచనలు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి అమలవుతున్న కొత్త నిబంధనలు ఏమిటి? ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. కొత్త నిబంధనల ప్రకారం ఒక పని చేయకపోతే ఇప్పటివరకు పొందుతున్న రాయితీ తొలగించే అవకాశం ఉంది.

ఎల్పీజీ సిలిండర్లు పొందడానికి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (బీఏఏ) అవసరం. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారు ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చమురు ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. ఒకవేళ ఆధార్‌ ధృవీకరణ పొందని వారు ఉంటే వెంటనే ఎల్పీజీ పంపిణీదారుడి ద్వారా గానీ లేదా సంబంధిత ఓఎంసీ యాప్ ద్వారా బీఎఎను పూర్తి చేసుకోవచ్చు. అయితే ఆధార్ అనుసంధానం చేయడం, బయోమెట్రిక్ పూర్తి చేయడం అనేది రెండూ ఒకటే కావు.

దేశంలోని కోట్లాది మంది ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని అందించింది. అక్టోబర్ 1, 2026 నుంచి రాయితీ ధరలకు ఎల్పీజీ రీఫిల్‌లను బుక్ చేసుకోవడానికి బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (బీఏఏ) పూర్తి చేయడం తప్పనిసరి. ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్‌లు యథావిధిగా కొనసాగుతాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  

27.43 కోట్ల మంది పూర్తి
దేశంలోని 27.43 కోట్ల మంది క్రియాశీల గృహ ఎల్‌పిజి వినియోగదారులు ఉన్నారు. అంటే మొత్తం వినియోగదారులలో 89.9 శాతం మంది ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను పూర్తి చేశారు. ఈ వినియోగదారులు మళ్లీ ఇ-కేవైసీ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులు అక్టోబర్ 1 లోగా బీఏఏను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా చేస్తేనే రాయితీ డబ్బులు పొందవచ్చు.

ఆధార్‌ అనుసంధానం
గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేయడం, బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్‌ను పూర్తి చేయడం అనేవి ఒకే విషయం కాదు. ఆధార్ సీడింగ్ అంటే వినియోగదారుడి ఆధార్ నంబర్‌ను ఎల్‌పీజీ కనెక్షన్‌కు అనుసంధానం చేయడం. వినియోగదారుడు బయోమెట్రిక్ లేదా అందుబాటులో ఉన్న డిజిటల్ అథెంటికేషన్ పద్ధతుల ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఇప్పటికే గ్యాస్ కనెక్షన్‌కు లింక్ చేసి ఉంటే బీఏఏ పూర్తయినట్లు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES