SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

LPG Cylinder Price Drop: వినియోగదారులకు శుభవార్త..19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.600 తగ్గింపు..ఎక్కడో తెలుసా?

LPG Cylinder Price Drop Update: దేశంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణ ప్రాంతాల్లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్లపై రూ. 200 నుండి రూ. 600 వరకు తగ్గింపు లభిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కాకుండా, స్థానిక ఏజెన్సీలే అదనపు నిల్వలను క్లియర్ చేయడానికి, ఖాళీ సిలిండర్ల సరఫరా సైకిల్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ డిస్కౌంట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రాంతాల గృహ వినియోగదారుల గ్యాస్ బుకింగ్ పరిమితిని 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గించడం ప్రజలకు ఊరటనిచ్చింది.

Written By Harish Darla
Published: Sep 23, 2026, 01:01 PM IST | Updated: Sep 23, 2026, 01:25 PM IST
Join

LPG Cylinder Price Drop Update: దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణాలలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల లభ్యత సాధారణ స్థితికి రావడమే కాకుండా చౌక ధరకు లభిస్తోంది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధ సమయాల్లో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం తీవ్ర పరిమితులు విధించడంతో ఈ సిలిండర్ల లభ్యత ఎంతో కష్టమైంది. 

ఏప్రిల్ - మే నెలల మండుటెండల్లో క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నుండి ఇప్పుడు సులభంగా లభించే స్థాయికి గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్ వంటి ప్రాంతాల్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ అధికారిక రేటు రూ. 2,946 కాగా, ఏజెన్సీలు వీటిని రూ. 2,400 నుండి రూ. 2,700 మధ్య తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

ఏజెన్సీలు ఎందుకు తగ్గించాయి?
ఈ రకమైన డిస్కౌంట్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అధికారికంగా ప్రకటించలేదు. గ్రామీణ ప్రాంతాలలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, స్వీట్ షాపులు, క్యాటరింగ్ వ్యాపారాల నుండి 19 కేజీల సిలిండర్లకు డిమాండ్ తక్కువగా ఉండటంతో ఏజెన్సీల వద్ద సరుకు ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. చిన్న దుకాణదారులు గృహ సిలిండర్లను వాడుతుండటంతో వాణిజ్య సిలిండర్లు స్టాక్ నిలిచిపోతుంది. 

గ్యాస్ సరఫరా వాహనానికి సరిపడా ఖాళీ సిలిండర్లను తిరిగి ఇవ్వకపోతే తదుపరి సప్లై ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగకుండా ఉండటానికి ఏజెన్సీలు రూ. 200 నుండి రూ. 600 వరకు తగ్గింపుతో ప్రజలకు అందుబాటులో ఉంచాయి.

సిలిండర్ బుకింగ్ వ్యవధి తగ్గింపు
మరోవైపు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగదారులకు ఇటీవలే చేసిన ప్రకటన కీలక ఉపశమనం అందించింది. గతంలో గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత తదుపరి బుకింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉండేది, నగరాల్లో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని సవరించారు. సరఫరా మెరుగుపడటంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పరిమితిని 25 రోజులకు తగ్గించారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు దీనిని తక్షణమే అమలు చేశాయి.

Also Read: Bank Holidays: వచ్చే వారం బ్యాంకులకు 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?

Also REad: Gold Price Prediction: 2027లో భారీగా పెరగనున్న బంగారం ధరలు.. గోల్డ్ రేట్లు ఎంతకు చేరుతాయో తెలుసా?
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES