SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

UPI Payments: యూపీఐ పేమెంట్లపై భారీ షాక్‌.. పెట్రోల్‌ బంకుల్లో రూ.2 వేలపైన బంద్‌!

Petrol Dealers Deny To Rs 2000 About UPI Payments: యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ఎండీఆర్‌ ఛార్జీలు ప్రకటించడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పెట్రోల్‌ బంకుల్లో రూ.2 వేలపైన యూపీఐ పేమెంట్లు బంద్‌ చేస్తున్నట్లు డీలర్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 22, 2026, 05:05 PM IST | Updated: Sep 22, 2026, 05:07 PM IST
Image Credit: Zee Business
Join

UPI Payments MDR: భారతదేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యూపీఐ చెల్లింపులపై ఆందోళన నెలకొంది. రూ.2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూల్‌ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌ బంక్‌లో రూ.2 వేలకు పైన యూపీఐ చెల్లింపులు చేసుకోమని ప్రకటించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయిన వేళ నగదు లావాదేవీలు ఎక్కడా జరగడం లేదు. యూపీఐ ద్వారా లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్న సమయంలో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎండీఆర్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్ 16వ తేదీ నుంచి రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల పెట్రోల్ పంప్ డీలర్ల సంఘాలు ప్రకటించాయి. పంజాబ్ డీలర్స్ అసోసియేషన్ అక్టోబర్ 16వ తేదీ నుంచి యూపీఐ ఆధారంగా బంకుల్లో రూ.2,000 దాటితే పేమెంట్లకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) భారాన్ని తాము మోయలేమని.. తమకు నష్టాలు వస్తాయని పెట్రోల్‌ డీలర్లు స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ వసూల్‌ చేస్తుండడంతో తమకు వచ్చే లాభాలు ఏమీ దక్కవని పెట్రోల్‌ డీలర్లు చెబుతున్నారు. ఈ విషయమై మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇంధన (పెట్రోల్‌, డీజిల్‌) విక్రయాలపై తమకు వచ్చే నికర లాభం 0.5 శాతం మాత్రమేనని తెలిపారు. ఇంత తక్కువ మార్జిన్‌పై 0.4 శాతం ఎండీఆర్‌ చార్జీ విధిస్తే తాము మరింత నష్టాల్లోకి వెళ్తామని మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ నష్టం
ఒక్కో పెట్రోల్ బంక్‌‌లో రోజుకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలు చేసే కస్టమర్లు చాలామంది ఉంటారు. ఉదాహరణకు వంద మంది రూ.2 వేలపై యూపీఐ పేమెంట్లు చేస్తే దీనివల్ల రోజుకు రూ.590 చొప్పున.. నెలకు సుమారు రూ.17,700 వరకు డీలర్ నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రూ.2 వేలపైన యూపీఐ లావాదేవీలు మధ్యప్రదేశ్‌లో బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

రూ.2,000 కంటే ఎక్కువ లావాదేవీలు కేవలం యూపీఐ చెల్లింపులకు మాత్రమేనని.. వాహనదారులు యథావిధిగా డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగించుకుని చెల్లింపులు చేయవచ్చు. కార్డులపై ఎలాంటి పరిమితి లేదని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ప్రకటించాయి. యూపీఐ లావాదేవీలపై కూడా మినహాయింపు ఇవ్వాలని పెట్రోల్‌ డీలర్లు కోరుతున్నారు. గతంలో కార్డు లావాదేవీలకు ఎండీఆర్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES