SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జియో కస్టమర్లకు బంపర్ గుడ్‌న్యూస్.. రూపాయి ఖర్చు లేకుండా ఏడాదిపాటు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

Reliance Jio offer: రిలయన్స్ జియో తన పదవ వార్షికోత్సవం తోపాటు రాబోయే పండగ సీజన్ ను పురస్కరించుకుని బ్రాండ్ బ్యాండ్ యూజర్లకు ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. జియో హోమ్ 30 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ ప్లాన్స్ ను ఉపయోగించే కస్టమర్లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఏడాదిపాటు ఫ్రీ అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Bhoomi
Published: Sep 22, 2026, 03:22 PM IST | Updated: Sep 22, 2026, 03:24 PM IST
Image Credit: Reliance Jio offer
Join

Reliance Jio offer: దేశీయ టెలికాం.. ఇంటర్నెట్ రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో, పండుగ సీజన్ తోపాటు..  తన 10వ వార్షికోత్సవం సందర్భంగా తన వినియోగదారులకు ఒక అద్భుతమైన బహుమతిని తీసుకువచ్చింది. కొత్త ప్లాన్‌లు, ఆఫర్‌లతో ఎల్లప్పుడూ తన వినియోగదారులను ఆకట్టుకునే జియో, ఇటీవల OTT ప్రియుల కోసం ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ లైట్‌కు ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతున్నారు. వినోదం,  షాపింగ్ రెండింటినీ ఆస్వాదించే జియో వినియోగదారులకు ఇది నిజంగా గొప్ప శుభవార్త అని చెప్పాలి.

ఈ 12 నెలల ఉచిత ప్రయోజనం ప్రధానంగా జియోహోమ్ 3-ఇన్-1 (టీవీ, OTT, వై-ఫై) కనెక్షన్ ఉన్న వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. 30 Mbps నుండి 100 Mbps మధ్య ఇంటర్నెట్ సర్వీస్ వేగం ఉన్న కొత్త.. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఈ ప్రయోజనం పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఒక సంవత్సరం ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో, వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలను అపరిమితంగా చూడవచ్చు. అదనంగా, వారు అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో చేసే కొనుగోళ్లపై ఎటువంటి డెలివరీ ఛార్జీలు లేకుండా ఉచిత,  వేగవంతమైన డెలివరీ సేవలను కూడా పొందవచ్చు. ఇది ఆన్‌లైన్ షాపర్‌లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

యాక్టివేషన్ ప్రక్రియ..:
ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 19 నుండి దేశవ్యాప్తంగా దశలవారీగా ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు రాబోయే రెండు వారాల్లో అర్హులైన కస్టమర్లందరికీ పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఈ అమెజాన్ ప్రైమ్ లైట్ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. కస్టమర్లు తమ ఫోన్‌లో MyJio యాప్‌ను తెరిచినప్పుడు, హోమ్ పేజీలో ఈ ఆఫర్ స్పష్టంగా కనిపిస్తుంది. వారు ఆఫర్ బ్యానర్‌పై ట్యాప్ చేసిన వెంటనే, ఒక సంవత్సరం ఉచిత మెంబర్‌షిప్ విజయవంతంగా యాక్టివేట్ అవుతుంది.

ఈ ఉచిత సేవలు యాక్టివేషన్ తేదీ నుండి సరిగ్గా 12 నెలల పాటు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా, హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్న జియో కస్టమర్లకు కూడా ఒక శుభవార్త ఉంది. గతంలో రూ. 888, రూ. 1199,  150 Mbps లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉన్న ప్లాన్‌ల కస్టమర్లకు అందించిన 24 నెలల అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనం యథావిధిగా కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. జియో తన 10 ఏళ్ల పాలనను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

Also Read:  మొత్తానికి శాంతించిన బంగారం ధరలు.. సెప్టెంబర్ 20వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!!

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES