SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త..!

SBI Alert: సైబర్ నేరగాళ్లు దోపిడికి అడ్డు అదుపులేకుండా పోతుంది. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసానికి తెరతీశారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) వివరాలను అప్‌డేట్ చేయాలంటూ.. నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లను అప్రమత్తం చేసింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 21, 2026, 13:04 IST | Updated: Nov 21, 2026, 13:24 IST
Image Credit: Pensioners Cyber Fraud (Source: File)
Join

SBI Alert: రిటైర్‌మెంట్ తరువాత వచ్చే పెన్షన్‌పైనే ఆధారపడి జీవించే వృద్ధులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి అవసరాలు, పెన్షన్ నిలిచిపోతుందనే భయాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ మోసంపై కీలక సూచనలు చేసింది. సైబర్ నేరగాళ్లు పెన్షన్ అధికారుల మాదిరిగా నటిస్తూ నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారని వెల్లడించింది. పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

పెన్షనర్లకు ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న నకిలీ సందేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాము పెన్షన్ విభాగం అధికారులు లేదా సంబంధిత సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ బాధితులను సంప్రదిస్తున్నారు. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) వివరాలను అప్‌డేట్ చేయాలని, లేదంటే పెన్షన్ చెల్లింపుల్లో సమస్యలు ఎదురవుతాయని నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో ఒక లింక్ పంపించి, దానిపై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని చెబుతున్నారు. పెన్షన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని.. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మబలుకుతున్నారు. మరికొందరైతే వివరాలు ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోతుందని భయపెడుతున్నారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా వల వేస్తూ.. దోచుకుంటున్నారు. ఒక్కసారి వారి మాటలు నమ్మి వివరాలు అందిస్తే బ్యాంకు ఖాతాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ తరహా మోసాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పెన్షనర్లను అప్రమత్తం చేసింది. తన సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా 'కెప్టెన్ వై (Captain Y – Your Cyber Rakshak)' పేరుతో ప్రత్యేక వీడియోను కూడా బ్యాంక్ షేర్ చేసింది. ఈ వీడియోలో మోసగాళ్లు అనుసరించే పద్ధతులను వివరించింది. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని.. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని సూచించింది. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా.. దాని వెనుక కారణమేంటో తెలుసుకోవాలని కోరింది. అనవసరమైన లింక్‌లపై క్లిక్ చేసి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించింది.

PPO అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (Pension Payment Order). ఉద్యోగ విరమణ తర్వాత అర్హులైన వారికి పెన్షన్ చెల్లింపులు జరిపేందుకు జారీ చేసే ముఖ్యమైన అధికారిక పత్రం ఇది. ఇందులో పెన్షనర్‌కు సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. పెన్షన్ చెల్లింపుల విషయంలో ఈ నంబర్ కీలకంగా పనిచేస్తుంది. ఈ వివరాల ప్రాముఖ్యతను ఆసరాగా చేసుకుంటున్న మోసగాళ్లు PPO అప్‌డేట్ పేరుతో పెన్షనర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నిజమని నమ్మకూడదని సైబర్ భద్రతా సంస్థలు కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా పెన్షనర్లు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కీలక సూచనలు..

 

 

Add Zee News as a Preferred Source

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES