SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్!

Top Stocks To Buy: స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నా కొన్ని స్మాల్ క్యాప్, పెన్నీ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయని చెప్పాలి. ఒక్క వారంలోనే 91శాతానికి పైగా రిటర్న్స్ అందించి.. పెట్టుబడిదారుల పెట్టుబడిని రెట్టింపు చేశాయి. ఆ స్టాక్స్ ఏవో చూద్దాం.

Written By Bhoomi
Published: Sep 15, 2026, 11:19 AM IST | Updated: Sep 15, 2026, 11:55 AM IST
Image Credit: Top Stocks To Buy:
Join

Top Stocks To Buy: గత వారం భారత స్టాక్ మార్కెట్ కు టైం బాగలేదు. సూచీలు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అయినా సరే కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఏమాత్రం తగ్గదేలే అంటూ దూసుకెళ్లాయి. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ 5 షేర్లు మాత్రం తమ పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఏకంగా 91శాతానికిపైగా రిటర్న్స్  అందించి దాదాపు డబ్బును డబుల్ చేశాయని చెప్పాలి. 

మార్కెట్ ఎందుకు పడిపోయింది?
గత వారం, బీఎస్ఈ సెన్సెక్స్ 1,733.67 పాయింట్లు లేదా 2.26 శాతం పడిపోయి, 74,781.76 వద్ద ముగిసింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 499.6 పాయింట్లు లేదా 2.09 శాతం పడిపోయి, 23,398.10 వద్ద ముగిసింది. సూచీలో ఈ పతనం చూసి పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. అయినప్పటికీ, కుప్పకూలుతున్న ఈ మార్కెట్‌లో కూడా, ఐదు స్టాక్‌లు బలమైన లాభాలను అందించాయి.

ఈఎస్డీఎస్ సాఫ్ట్‌వేర్  దూకుడు:
ఇటీవల లిస్ట్ అయిన ఈఎస్డీఎస్ సాఫ్ట్‌వేర్ స్టాక్ గత వారం అగ్రగామిగా నిలిచింది. ఈ స్టాక్ 91.65 శాతం మొత్తం రాబడిని అందించింది. అంటే పెట్టుబడిదారుల డబ్బు దాదాపు రెట్టింపు అయింది. ఈ స్టాక్ ధర ఒక వారంలో రూ. 895.55 నుండి రూ. 1,716.35 కు పెరిగింది. శుక్రవారం, ఈ స్టాక్ బీఎస్ఈలో 10 శాతం పెరిగి, రూ. 1,716.35 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,117.50 కోట్లకు చేరుకుంది.

అన్మోల్ ఇండియా, మార్బుల్ సిటీ హవా:
గత వారం అన్మోల్ ఇండియా షేర్లు 69.22 శాతం పెరిగాయి. కంపెనీ షేరు ధర రూ.10.04 నుండి రూ.16.99కి పెరిగింది. శుక్రవారం, ఈ స్టాక్ 10 శాతం పెరిగి రూ.16.99 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.96.01 కోట్లుగా ఉంది. మరోవైపు, గత వారం మార్బుల్ సిటీ ఇండియా షేర్లు 68.10 శాతం పెరిగాయి. ఈ స్టాక్ రూ.102.50 నుండి రూ.172.30కి పెరిగింది. శుక్రవారం, ఇది 19.28 శాతం పెరిగి రూ.172.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.48.50 కోట్లుగా ఉంది.

లాడరప్ ఫైనాన్స్, సన్ రిటైల్ షేర్ల విజృంభణ:
గత వారం లాడరప్ ఫైనాన్స్ షేర్లు 63.24 శాతం పెరిగాయి. ఈ వారం ఈ స్టాక్ రూ.47.50 నుండి రూ.77.54 కు పెరిగింది. శుక్రవారం ఇది 18.13శాతం లాభంతో రూ.77.54 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.70 కోట్లు. చివరగా, గత వారం సన్ రిటైల్ స్టాక్ 58.06శాతం లాభపడింది. ఈ స్టాక్ రూ.0.31 నుండి రూ.0.49 కు పెరిగింది. శుక్రవారం ఇది 8.89శాతం లాభంతో రూ.0.49 వద్ద ముగిసింది. దీని మార్కెట్ క్యాప్ రూ.7.60 కోట్లుగా ఉంది.

Also Read:  పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..!!

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES