SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

TRAI New Rules: స్పామ్ కాల్స్‌కు ‘ట్రాయ్’ చెక్.. కొత్త నిబంధనలు ఇవే.. ఈ చిన్న పని చేస్తే చాలు..!

How to Block Spam Calls: రోజంతా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు వచ్చే స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లతో విసిగిపోతున్నారా..? లోన్లు, క్రెడిట్ కార్డులు, సైబర్ మోసాల వలలతో విరుచుకుపడుతున్న స్పామర్లకు ముకుతాడు వేసేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇందుకు కోసం కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

Written By Ashok Krindinti
Published: Sep 29, 2026, 05:24 PM IST | Updated: Sep 29, 2026, 05:26 PM IST
Image Credit: Spam Calls (AI Generated)
Join

How to Block Spam Calls: మొబైల్ వినియోగదారులను నిత్యం వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్. లోన్స్, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్, ఓపెన్ ప్లాట్స్ అంటూ ప్రతి రోజూ వచ్చే నకిలీ కాల్స్‌తో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ స్పామ్ కాల్స్‌లో ఆన్‌లైన్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందుబాటులోకి రానుంది. స్పామ్ కాల్స్, ప్రమోషనల్ సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. సాధారణ పర్సనల్ మొబైల్ నంబర్లను అడ్డం పెట్టుకుని అనధికారికంగా మార్కెటింగ్ కార్యకలాపాలు, మోసపూరిత కాల్స్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ట్రాయ్ నిర్ణయించింది. జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి అన్ని టెలికాం కంపెనీలు స్పామ్ కాల్స్‌ను గుర్తించేందుకు AI ఉపయోగించాలని స్పష్టం చేసింది. స్పామర్‌ను AI ఆటోమెటిక్‌గా గుర్తించి.. కంపెనీ వారి కనెక్షన్‌ను స్టాప్ చేస్తుంది. దీంతో ఫేక్ నంబర్ల గురించి ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు.  

మనకు స్పామ్ కాల్స్ మళ్లీ రాకుండా ఉండేందుకు ఆ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టేస్తుంటాం. కానీ అధికారికంగా ఫిర్యాదు చేసేవారిలో చాలా తక్కువమంది ఉన్నారు. దీంతో స్పామ్ కాలర్లు కొత్త నంబర్లతో కాల్స్‌ చేస్తూ మరింత విసిగిస్తున్నారు. కానీ ట్రాయ్ కొత్త రూల్స్‌తో మొత్తం వ్యవస్థ మారిపోయింది. ఒక టెలికాం కంపెనీకి సంబంధించి ఏఐ ఒక నంబర్‌ను స్పామ్‌గా అనుమానిస్తే.. ఆ కంపెనీ కస్టమర్ ఫిర్యాదు కోసం వేచి చూడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి.

కొత్త రూల్స్ ప్రకారం.. ఒక నెట్‌వర్క్ AI సిస్టమ్‌కు అనుమానాస్పద కాల్ అందిన వెంటనే.. అది 2 గంటలలోపు ఆ కాల్ వచ్చిన నెట్‌వర్క్‌కు పూర్తి సమాచారాన్ని అందించాలి. ఆ తరువాత ఏ కంపెనీ అయితే సిమ్ కార్డును ఉపయోగించారో.. ఆ కంపెనీ ఒక వర్కింగ్ డేలో ఆ వ్యక్తి KYC డేటాను కనుగొని.. దానిని మిగతా అన్ని టెలికాం కంపెనీలతో పంచుకోవాలి. అంతేకాకుండా గత 10 రోజుల్లో ఆ స్పామర్ కేవైసీపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌లో ఉన్నాయో అన్ని కంపెనీలు చెక్ చేస్తాయి. ఒక వ్యక్తి లేదా కంపెనీ కేవైసీకి అనుసంధానించిన వేర్వేరు నంబర్ల నుంచి ఐదు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వచ్చినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు. కాల్ చేసిన సిమ్ కార్డును బ్లాక్ చేయడమే కాకుండా.. స్పామర్ పేరు మీద ఉన్న అన్ని ఫోన్ కనెక్షన్లను కూడా తక్షణమే నిషేధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది.

నిబంధనలను ఉల్లంఘించి స్పామ్ కాల్స్ లేదా సందేశాలు పంపినట్లు నిర్ధారణ అయితే.. మొదటి తప్పిదానికే సదరు నంబర్‌కు సంబంధించిన అన్ని రకాల ఔట్‌గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలను తక్షణమే 15 రోజుల పాటు నిలిపి వేస్తారు. ఈ 15 రోజుల నిషేధం ముగిసిన తర్వాత కూడా అదే నంబర్ నుంచి మళ్లీ స్పామ్ కార్యకలాపాలు కొనసాగితే.. ఆ మొబైల్ కనెక్షన్‌ను శాశ్వతంగా రద్దు చేసి, సదరు వినియోగదారుడిని లేదా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. వారిని పూర్తి ఒక సంవత్సరం పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు. దీనివల్ల వారు దేశంలోని ఏ కంపెనీ నుంచి అయినా ఏడాదిపాటు కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు.

ప్రస్తుతం చాలా మంది తమ ఫోన్‌లలో ట్రూకాలర్ లేదా కాలింగ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను వాడుతున్నారు. ట్రాయ్ కొత్త రూల్స్‌లో ఈ యాప్స్‌కు కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఇలాంటి యాప్స్‌ ప్రభుత్వం లేదా టెలికాం అధికారులు నిర్దేశించిన ప్రత్యేక నంబర్ సిరీస్‌లను (ఉదాహరణకు 160) ఇష్టానుసారంగా స్పామ్‌గా గుర్తించడగానికి లేదా బ్లాక్ చేసేందుకు అవకాశం ఉండదు. ఈ నంబర్ సిరీస్‌లు ప్రభుత్వ, అధికారిక వాణిజ్య కాల్‌ల కోసం కేటాయించినవి. అయితే వినియోగదారులు తమకు నచ్చని నంబర్లను ఫోన్‌లో బ్లాక్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

మీకు స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఉండాలనే మీ ఫోన్ నుంచి 1909 నంబర్‌కు "BLOCK PROMO" అని టైప్ చేసి SMS పంపాలి. ఇలా చేస్తే..  మీ నంబర్‌కు వచ్చే అన్ని బిజినెస్, ప్రమోషనల్ కాల్స్ పూర్తిగా నిలిచిపోతాయి. మీ బ్యాంక్ ఓటీపీలు, లావాదేవీల సందేశాలు, అత్యవసర ప్రభుత్వ నోటిఫికేషన్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదు. పెరుగుతున్న సైబర్ మోసాలు, అవాంఛిత కాల్స్ నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా ఈ సరికొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES