SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

UPI: యూపీఐ లావాదేవీలపై బాంబు పేల్చిన కేంద్రం..రూ.2,000 దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాలి! ఎప్పటినుంచి?

UPI Payment Charges News: రూ.2,000 దాటిన యూపీఐ (UPI) చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీలు వర్తింపజేయాలని నిర్ణయించినప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడదని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేశాయి. ఈ ఛార్జీలను కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లిస్తారని, సాధారణ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయని తెలిపాయి.

Written By Harish Darla
Published: Sep 15, 2026, 08:00 PM IST | Updated: Sep 15, 2026, 08:03 PM IST
Join

UPI Payment Charges News: దేశవ్యాప్తంగా ఏటికేడాది యూపీఐ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వీసా (Visa), మాస్టర్ కార్డ్ (Mastercard) వంటి అమెరికన్ సంస్థల ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశంలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానుంది

ప్రజలు, విపక్షాల వ్యతిరేకత..
రూ. 2,000 దాటిన లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే నిర్ణయంపై సాధారణ ప్రజల నుండి, విపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకతపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేస్తూ స్పష్టతనిచ్చింది. రూ. 2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం వ్యాపారులు మాత్రమే చెల్లిస్తారని ప్రభుత్వం వివరించింది.

ఎన్‌సీపీఐ స్పష్టత, అమలు తేదీ.. 
'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) కూడా ఈ అంశంపై స్పందిస్తూ, వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న విధంగానే యూపీఐ సేవలు ఉచితంగానే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15 నుండి అమల్లోకి వస్తుందని ఎన్‌సీపీఐ ప్రకటించింది.

విపక్షాలు, నిపుణుల ఆందోళన..
కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీపీఐ వినియోగదారులపై నేరుగా భారం పడదని చెబుతున్నప్పటికీ, విపక్షాలు ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. వ్యాపారులపై భారం పడినప్పుడు, వారు పరోక్షంగా ఆ మొత్తాన్ని వినియోగదారులపైనే మోపుతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థిక రంగ నిపుణులు కూడా ఇదే విషయమై హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు తమపై పడే చిన్నపాటి భారాన్ని కూడా వినియోగదారులపైకి బదిలీ చేయడం ప్రారంభిస్తే, యూపీఐ లావాదేవీలు నెమ్మదించే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Also REad: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!

Also Read; వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు
 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES