SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వేద మంత్రంతో కేంద్ర మంత్రి సందేశం.. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం.. గజేంద్ర సింగ్ షెకావత్!

WION Iconic Tourism Summit: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, వేగంగా మారుతున్న పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ తన ఆర్థిక పురోగతితో స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.

Written By Bhoomi
Published: Sep 23, 2026, 01:22 PM IST | Updated: Sep 23, 2026, 01:24 PM IST
Image Credit: WION Iconic Tourism Summit
Join

WION Iconic Tourism Summit:  2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, వేగంగా మారుతున్న పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ తన ఆర్థిక పురోగతితో స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన WION ఐకానిక్ టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026లో షెకావత్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భారత అభివృద్ధి ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వేదాల్లోని ‘చరైవేతి.. చరైవేతి’ అనే మంత్రాన్ని ఆయన ఉటంకించారు.  

భారతీయ సంస్కృతి, వేదాల నుంచి స్ఫూర్తిని తీసుకున్న షెకావత్.. నిరంతరం ముందుకు సాగుతూ జ్ఞానం, కొత్త అవకాశాలను అన్వేషించాలనే సందేశాన్ని ‘చరైవేతి.. చరైవేతి’ సూచిస్తుందని అన్నారు. మార్పు అనేది శాశ్వతం. అయితే ఆధునిక కాలంలో మార్పు వేగం మరింత పెరిగింది. ఈ వేగవంతమైన పరివర్తనకు అనుగుణంగా భారత్ కూడా ముందుకు సాగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించారని షెకావత్ అన్నారు.

తొలి త్రైమాసిక వృద్ధిపై ప్రస్తావన:
భారత్ తొలి త్రైమాసిక ఆర్థిక వృద్ధి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని అన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాల్లోనూ దేశం వేగంగా మార్పులను స్వీకరిస్తోందని ఆయన వివరించారు.

పర్యాటక రంగంపై కీలక చర్చలు:
WION ఐకానిక్ టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026లో ప్రపంచ పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. వీసా విధానాలు, అంతర్జాతీయ ప్రయాణం, సరిహద్దు నిర్వహణ, బయోమెట్రిక్ ట్రావెల్, డిజిటల్ టెక్నాలజీ, AI, పర్యాటక మౌలిక సదుపాయాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పర్యాటక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల అనుభవాలను మెరుగుపరచడంలో AI, డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న పాత్రపైనా సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.

దాదాపు 20 దేశాల ప్రతినిధుల భాగస్వామ్యం:
న్యూఢిల్లీలోని ITC Mauryaలో జరుగుతున్న ఈ సదస్సుకు పలు దేశాల దౌత్య ప్రతినిధులు, పర్యాటక, విమానయాన, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. అర్జెంటీనా, గ్రీస్, సురినామ్, ఐర్లాండ్, స్లోవేకియా, సైప్రస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం దాదాపు 20 దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పర్యాటక రంగంలో ప్రతిభకు అవార్డులు:
సదస్సు ముగింపు సందర్భంగా పర్యాటక, ప్రయాణ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు WION Iconic Awards 2026 అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, కొత్త అవకాశాలు, అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించిన సవాళ్లపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తోంది. WION వరల్డ్ కాన్ఫరెన్సెస్ సిరీస్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. VFS Global సమర్పిస్తుండగా, Red Hat Communications సహకారంతో సదస్సు జరుగుతోంది. అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించిన సాంకేతిక సేవలను అందిస్తున్న VFS Global ఈ ఏడాది తన సేవల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Also Read: ఇతరులను చూసి ఈర్ష్య పడితే జీవితంలో చిక్కులు తప్పవు అంటున్న సింహం, నక్క,

Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES