SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నవారికి బంపర్ ఆఫర్.. కెనరా బ్యాంక్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల.. 3,500 ఖాళీలు!

బ్యాంకు ఉద్యోగం సాధించాలని కలలు కనేవారికి ఒక శుభవార్త! ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 3500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Written By Renuka Godugu
Published: Sep 28, 2026, 12:53 PM IST | Updated: Sep 28, 2026, 12:54 PM IST
Image Credit: Canara Bank Apprentice Recruitment 2026
Join

బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కెనరా బ్యాంక్ ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ పౌరులు ఈ అప్రెంటిషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 1, 2026 నుండి ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. కేవలం 100 శాతం ప్రొఫైల్ పూర్తి చేసిన వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ అభ్యర్థులను ఎంపిక చేసి ట్రైనింగ్ అందిస్తుంది.

ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కాలపరిమితి 12 నెలలు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈ సమయంలో నెలకు మొత్తం స్టైఫండ్ రూ. 16,650 అందిస్తారు. మొత్తం 3,500 ట్రైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి, దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. వయస్సు పరంగా 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచీలలో ఈ భర్తీ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సీట్లు ఉన్నాయి. అర్హత మరియు వయస్సు నిబంధనలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు కనీసం పదో తరగతి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత స్థానిక భాషపై పరీక్ష నిర్వహిస్తారు, ఆ తర్వాతే ప్రక్రియ కొనసాగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, SC, ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు. ఇతర కేటగిరీలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వయస్సు సడలింపు విషయానికి వస్తే: SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, నాన్-క్రిమిలేయర్ OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్లు, OBC, SC, ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు పరిమితి 40 ఏళ్ల వరకు ఉంటుంది.

స్టైఫండ్ వివరాల ప్రకారం, కెనరా బ్యాంక్ రూ. 10,500, ప్రభుత్వం రూ. 6,150 అందిస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు నేరుగా తమ ఖాతాలో రూ. 16,650 స్టైఫండ్‌ను పొందుతారు. మీరు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇందులో తెలంగాణకు 134 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌కు 247 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు చివరి తేదీ లోపు తమ ప్రొఫైల్‌ను పూర్తిగా పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES