SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sekhar Master: అయ్యప్పస్వామి దయ వల్ల బైటపడ్డాం.. రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ క్లారిటీ.. వీడియో ..

Sekhar master road accident: కారు నుజ్జు నుజ్జు అయిన కూడా ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా స్వామి వారి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని మరల షూటింగ్ కు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Written By Inamdar Paresh
Published: Nov 12, 2026, 04:18 PM IST | Updated: Nov 12, 2026, 04:27 PM IST
Image Credit: sekhar master on road accident video
Join

Sekhar master responds on car accident tragedy: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఈ రోజున తెల్లవారు జామున శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ వద్ద ప్రమాదంకు గురైంది. పండ్లతో వెళ్తున్న భారీగా లారీ శేఖర్ మాస్టర్ టీమ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తాపడింది.  వెంటనే ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బైటకు రావడంతో శేఖర్ మాస్టర్ అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు సైతం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాజాగా.. కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ప్రమాద ఘటనపై వీడియోను సైతం విడుదల చేశారు.

 

 

శేఖర్ మాస్టర్ కారు ప్రమాదంపై మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి వల్ల తనతో పాటు తన టీమ్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డామని చెప్పుకొచ్చారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో తనతో పాటు నలుగురు ఉన్నాయని ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చారు. కారు మాత్రం కొంచెం నుజ్జు నుజ్జు అయ్యిందన్నారు. 

కానీ అందరు సేఫ్ గా ప్రమాదం నుంచి బైటపడ్డామన్నారు. అయ్యప్ప స్వామి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయిందని, తన అభిమానులకు,శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి అభిమానం ఎప్పుడు తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మరల సాంగ్ షూటింగ్ కు వెళ్తున్నట్లు మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES