SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Renu Desai: విడాకులపై పవన్‌ కల్యాణ్‌ను వెనకేసుకొచ్చిన రెండో భార్య రేణు దేశాయ్‌

Renu Desai First Reaction About Pawan Kalyan Divorce: రాత్రి నుంచి పవన్‌ కల్యాణ్‌ విడాకుల వార్త తీవ్ర సంచలనం రేపుతుండగా.. తాజాగా ఈ అంశంపై అతడి రెండో భార్య రేణు దేశాయ్‌ స్పందించారు. విడాకుల విషయంలో తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌కే పరోక్షంగా మద్దతు పలుకుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 10, 2026, 06:31 PM IST | Updated: Nov 10, 2026, 06:38 PM IST
Image Credit: Renu Desai Statement
Join

Renu Desai Post Viral: సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌ కల్యాణ్‌ విడాకులు హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. అన్నాలెజినోవాతో విడాకులు తీసుకున్న అంశంపై అతడి మాజీ భార్య రేణు దేశాయ్‌ స్పందించారు. పరోక్షంగా ఆమె తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

సోషల్‌ మీడియా వేదికగా రేణు దేశాయ్ కీలక పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే వారిని ఇంకా దూషించడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే కింద పడిపోయిన వాళ్లని తొక్కడం చాలా అమానుషమని పేర్కొన్నారు. వారు ఏ స్థాయిలో ఉన్నా.. వాళ్లు కూడా ఒక మనిషేనని గుర్తించాలని కోరారు. వాళ్లు కూడా ఒకరి సంతానం.. ఒక పేరెంట్ లేదా ఒకరి తోబుట్టువు అని మార్చిపోకూడదని రేణు దేశాయ్‌ హితవు పలికారు. 'మన ఇల్లు బాగా లేనప్పుడు దయచేసి ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరొద్దు' అని పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు.

'మనమంతా మనుషులం. మనందరికీ సానుభూతి, దయ రెండు ప్రాథమిక అవసరాలు. నా పోస్ట్ చూసి మీరు పిచ్చి రాతలు రాయవద్దు' అని సినీ నటి రేణు దేశాయ్ కోరారు. మనమంతా కలిసి మంచి సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. తనకు ఎలాంటి పేటీఎం డబ్బులు అందలేదని ప్రత్యర్థి విమర్శలపై రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది కేవలం తన మనసులోని మాట మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ చేసినందుకు కొందరు విమర్శలు చేస్తారనే విషయం దృష్టిలో ఉంచుకుని రేణు దేశాయ్‌ వివరణ ఇచ్చారు. ఈ పోస్టుపై తప్పుడు ప్రచారాలు జరగకుండా స్పష్టత ఇచ్చారు. 'నేను ఈ మాటలు చెప్పినంత మాత్రాన మీ పిచ్చి ఊహాగానాలు చేసుకోండి. ఒక సమాజంగా మనం ఇంతకంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించగలమని నమ్ముతున్నా. కాస్త దయతో, అర్థవంతంగా మాట్లాడినందుకు నాకేమీ పేటీఎం డబ్బులు రాలేదు. కొంచెం తెలివి ఉపయోగించి ఆలోచించే విధానం మాత్రమే ఇది' అని రేణు దేశాయ్‌ తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES