SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విలన్ గా రౌడీ బేబి కొత్త అవతారం.. ‘ఓం’లో కొత్త సాయి పల్లవిని చూడబోతున్నామా..!!

Sai Pallavi New Role: ‘రామాయణ’లో సీతమ్మగా పాత్రలో నటించిన సాయి పల్లవి రూట్ మార్చి విలన్‌గా భయపెట్టబోతున్నారా..? అసలు సాయి పల్లవి విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎవరికీ నచ్చదు కదా బ్రో.అందుకే కెరీర్‌లో మొదటిసారి నెగిటివ్ రోల్ చేస్తుందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ తన కెరీర్‌లో తొలిసారి నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్న మాట నిజమేనా..? మరి సాయి పల్లవి ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా..?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 18, 2026, 05:59 IST | Updated: Nov 18, 2026, 06:00 IST
Image Credit: Sai Pallavi Negative Role (X/Source)
Join

Sai Pallavi: సాయి పల్లవి ఎవరు ఊహించని విధంగా మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాలో సీతమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె నటనకు కొంత మంది వంకలు పెట్టినా.. మెజారిటీ ప్రజలు ఆమెను సీతమ్మగా అంగీకరించి వసూళ్ల వర్షం కురిపించారు. మొత్తంగా ఉత్తరాది ప్రేక్షకులు సైతం సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యారు.

ముఖ్యంగా తమిళనాడు, కేరళలలో సాయి పల్లవిని చూసే మంచి వసూళ్లు దక్కుతున్నాయి. మొత్తంగా తమిళనాడు, కేరళలో సాయి పల్లవికే పెద్ద కటౌట్స్ పెట్టారు మేకర్స్. రామాయణ మేనియా కంటిన్యూ అవుతుండగానే.. సాయి పల్లవి తన నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ధనుష్ హీరోగా నటిస్తూన్న ‘ఓం’ చాప్టర్ 1లో నిత్యా రెడ్డి అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేశారు సాయి పల్లవి.

అయితే అందరూ ఊహించినట్లుగా ఇది సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ కాదని.. ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుందనే వార్త హల్ చల్ చేస్తుంది.  ‘ఓం’ సినిమాలో ధనుష్‌కు సపోర్టింగ్ క్యారెక్టర్ కాకుండా... అతన్ని ఢీ కొట్టే విలన్ పాత్ర చేస్తుందట. గతంలో రౌడీ బేబీ సాంగ్‌తో ఆన్ స్క్రీన్‌పై రొమాంటిక్ కెమిస్ట్రీ పండించిన ఈ సూపర్ హిట్ జోడి.. ఇప్పుడు ప్రత్యర్ధులుగా కనిపించబోతున్నట్టు సమాచారం.

ధనుష్ లాంటి నటుడికి   సాయి పల్లవి తన నెగటివ్ యాక్టింగ్‌తో ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.ఇప్పటివరకు తన డ్యాన్స్, నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న సాయి పల్లవి.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ షేడ్స్ ఉన్న  క్యారెక్టర్ చేయడం అందరినీ ఆశ్యర్యానికి  చేస్తోంది.

రామాయణలో సీతమ్మ పాత్రలో మెప్పించిన వెంటనే.. ఈ తరహా డిఫెరెంట్ రోల్ చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ మూవీ  తర్వాత మణిరత్నం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుంది పల్లవి. 
 

Add Zee News as a Preferred Source

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES