SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vijay Deverakonda: పుట్టపర్తి సాయిబాబాగా విజయ్ దేవరకొండ.. హీరో ఏమన్నారంటే..?

Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన రష్మిక మందన్నతో కలిసి ‘రానాబాలి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సత్యసాయి బాబా బయోపిక్‌లో నటించాలని తనకు ఉన్న కోరిక గురించి ఆయన మాట్లాడారు.

Written By Vishnu Priya
Published: Oct 10, 2026, 07:50 PM IST | Updated: Oct 10, 2026, 07:57 PM IST
Join

Vijay Deverakonda: సత్యసాయి బాబా జీవితంపై బయోపిక్ తీయాలని తనకు ఉందని విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే ఆయన పాత్రలో మాత్రం తాను నటించలేనని అభిప్రాయపడ్డారు. తాను ఎన్నో లోపాలు ఉన్న వ్యక్తినని.. ఎంతో పవిత్రమైన వ్యక్తి పాత్రను తాను పోషించలేనని అన్నారు. ఆయన మాటలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.

సత్యసాయి బాబాకు దేశవిదేశాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, బోధనలు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. అలాంటి వ్యక్తి జీవితాన్ని సినిమాగా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కథ, నటీనటుల ఎంపిక విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిన్నతనంలోనే విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్యసాయి బాబాకు సంబంధించిన వీడియోలో కనిపించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం కూడా మరోసారి చర్చలోకి వస్తోంది. అయితే సత్యసాయి బాబా బయోపిక్‌లో తాను నటిస్తానని విజయ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఒకవేళ భవిష్యత్తులో విజయ్ ఈ పాత్రలో నటిస్తే మాత్రం అది ఆయన కెరీర్‌లో చాలా కీలకమైన సినిమాగా మారే అవకాశం ఉంది. నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ సినిమా ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అదే తరహాలో సత్యసాయి బాబా బయోపిక్ కూడా అద్భుతంగా తెరకెక్కి విజయం సాధిస్తే విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించకపోతే పరిస్థితి మరోలా ఉండవచ్చు. ఇలాంటి గొప్ప వ్యక్తి పాత్రను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ బయోపిక్ విజయ్‌కు ఒక గొప్ప అవకాశంతో పాటు పెద్ద సవాలుగా కూడా మారవచ్చు.

Read More: Rakul Preet Singh Birthday: నడిరోడ్డుపై ఆకతాయిని చితక్కొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్! ఏం జరిగిందంటే?

Read More: టాలీవుడ్ కొత్త డైరెక్టర్‌తో యశ్ ప్యాన్ ఇండియా మూవీ.. రాకీ భాయ్ కొత్త ప్లాన్ ఇదేనా..!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES