SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చీచీ.. మైనర్‌ బాలుడిపై థెరపిస్ట్‌ లైం**గిక అఘాయిత్యం.. ఎక్కడ జరిగిందో తెలుసా?

Contra Costa Therapist Case: దారి తప్పిన మైనర్లను సక్రమంగా చూసుకుంటూ.. మంచి మార్గాల్లో పెట్టాల్సిన ఓ మహిళ హెల్త్ థెరపిస్ట్ చేసిన అఘాయిత్యం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఓ మైనర్ బాలుడిని లై**గికంగా వినియోగించుకున్న ఘటన కాలిఫోర్నియాలోని చోటుచేసుకుంది. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 26, 2026, 12:23 PM IST | Updated: Sep 26, 2026, 12:25 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Contra Costa Therapist Case: కాలిఫోర్నియాలోని కాంట్రా కోస్టా కౌంటిలో ఓ తీవ్ర సంచలనం రేపే ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారితప్పిన మైనర్లను సరైన మార్గంలో పెట్టాల్సిన ఓ మహిళ బిహేవియరల్ హెల్త్ థెరపిస్ట్.. ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. తని స్వయంగా ఒక మైనర్ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తోంది. తన వద్ద కౌన్సెలింగ్ తీసుకుంటున్న టీనేజ్ క్లైంట్ తో అనైతిక సంబంధం పెట్టుకున్నందుకు 26 ఏళ్ల సోఫియా ఆన్-బ్యూట్రాన్ డ్రాట్స్ అనే మహిళను పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారట. అయితే ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మార్టినెజ్ అనే ప్రాంతంలో ఉన్న జాన్ ఎ. డేవిస్ జువైనల్ డిటెన్షన్ సెంటర్ లో సోఫియా హెల్త్ కౌన్సిలర్ గా పని చేస్తూ వస్తున్నారు.. అక్కడికి వచ్చిన సుమారు 15 ఏళ్ల వయస్సు కలిగిన ఓ మైనర్ బాలుడికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే బాధ్యతను అధికారులు ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, కౌన్సెలింగ్ పేరుతో ఆమె ఆ బాలుడితో బాగా స్నేహం పెంచుకొని.. ఉద్దేశపూర్వకంగానే ఆ బాలుడిని ఆకర్షించిందని అధికారుల విచారణలో తేలింది..

ఆ బాలుడు ఏప్రిల్ 2026లో బెయిలు పై విడుదలయ్యాక కూడా సోఫియా తన సంబంధాన్ని కొనసాగించిందట.. అప్పటికి అతనికి 17 ఏళ్లు మాత్రమే.. తన కారులో కారులో వెళ్లి.. ఇంట్లో అతని రహస్యంగా కలుస్తూ వచ్చింది.. అంతేకాకుండా ప్రొబేషన్ నిబంధనలను ఉల్లంఘించి స్కూలుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని.. అలాగే తనతో బయట తిరగాలని ఆ బాలుడితో తెలిపేదట.. అంతేకాకుండా మైనర్ను లైం***గికంగా కూడా వాడుకున్నట్లు సమాచారం..

ప్రొబేషన్ నిబంధనల ప్రకారం.. ఆ మైనర్ బాలుడు సరైన సమయానికి హాజరు కాకపోవడంతో.. అధికారులకు అనుమానం వచ్చేసింది. ఇక అధికారులు పోలీసులు సమగ్రంగా విచారించడంతో.. ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జూలై 14న ఆ యువతీని అరెస్టు చేసి.. ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఊహించని సమాచారం వెలుగులోకి రావడంతో ఏడు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలుస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES