SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి!

Djibouti Boat Tragedy: జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భాగంగా దాదాపు 15 మంది పిల్లలతో పాటు 109 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘటనలో భాగంగా చాలా మంది తప్పిపోయిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పడవ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 11, 2026, 04:33 PM IST | Updated: Oct 11, 2026, 04:35 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Djibouti Boat Tragedy: ఉపాధితో పాటు మెరుగైన జీవనం కోసం అక్రమ మార్గాల్లో ప్రయాణం చేస్తున్న వలసదారుల ప్రయాణం తీరని విషాదాన్ని మిగిల్చింది... ఆఫ్రికాలోని జిబౌటి నుంచి యెమెన్ వైపు దాదాపు 350 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో బోల్తా పడింది.. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది చిన్న పిల్లలతో పాటు దాదాపు 109 మంది మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 116 మంది నీటిలో తప్పిపోయిన్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

అక్టోబర్ 8 నుంచి 9 మధ్య.. రాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. జిబౌటి నుంచి ఈ పడవ ప్రయాణం సాగుతండగా.. నియంత్రణ కోల్పోయి సముద్రంలో ఒక్కసారిగా మునిగిపోయింది.. అయితే, పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే.. ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది.. అలాగే ప్రమాదం జరిగిన సమయం రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు అధికారులు తెలుపుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే జిబౌటికి సంబంధించిన భద్రతా దళాలతో పాటు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 116 మంది కోసం తీరప్రాంతాల్లో నావికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది..

ఈ ప్రమాదం ఘటన నుంచి దాదాపు 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగలిగారని అక్కడి అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారంతా ఇథియోపియా దేశానికి చెందిన వలసదారులేనని అధికారులు వెల్లడించిన్నట్లు సమాచారం.. సురక్షితంగా బయటపడిన వారికి అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) అత్యవసర వైద్య సాయంతో పాటు తాత్కాలిక వసతి, ఆహారాన్ని అందిస్తున్నట్లు సమాచారం.

ఆఫ్రికా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే.. క్రమంలో చాలామంది ఎంతో ప్రమాదకరమైన ఎర్ర సముద్రం మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. సరైన రక్షణ లేని పడవల్లో తరలించే.. ముఠాల వల్ల తరచూ అమాయక ప్రజలతో పాటు పసిపిల్లలు ఇలా జల సమాధి అవుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలా తరలించే ముఠాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES