SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హనుమాన్ చాలీసాను గడగడా చదివిన విదేశీయుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Foreign Man Hanuman Chalisa Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు ఏమాత్రం తడబడకుండా హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా జైశ్రీరామ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియోలో సాంస్కృతమైన పదాలు ఉన్నప్పటికీ ఆ యువకుడు ఏ మాత్రం తడబడకుండా చదవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 03:36 PM IST | Updated: Sep 19, 2026, 03:40 PM IST
Image Credit: హనుమాన్ చాలీసాను గడగడా చదివిన విదేశీయుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Join

Foreign Man Hanuman Chalisa Video Viral: భారతదేశానికి చెందిన ప్రాచీన సాంస్కృతితో పాటు సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు ప్రస్తుతం దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా చేరుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది విదేశీయులు సైతం భారతీయ భక్తి మార్గాన్ని, పురాణ గ్రంథాలను అభ్యసిస్తూ ఆధ్యాత్మిక జీవన శైలి వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ ఒక వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా భారతీయ భాషలు లేదా సాంస్కృత శ్లోకాలను భారతీయులు పలకడమే హస్త కష్టంగా ఉంటుంది. అదే విదేశీయులు ఎలా పలకగలుగుతారో.. మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. ఉచ్చారణలో తప్పులు దొరలడం సర్వ సాధారణం. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు ఎందుకు పూర్తిగా విరుద్ధంగా ఉండడం మీరు గమనించవచ్చు. ఇంస్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక విదేశీ వ్యక్తి ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు భక్తిశ్రద్ధలతో చేతులను జోడించి కూర్చొని ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఎలాంటి తప్పులు దొరలకుండా శ్రీ హనుమాన్ చాలీసా లోని చౌపాయిలను పటిస్తూ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది..

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను ఎంత వేగంగా ఆ చాలీసాను చదువుతున్నప్పటికీ.. సాంస్కృతం పదాల్లో ఉచ్చారణ చాలా స్పష్టంగా.. అచ్చితత్వంతో ఉండడం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలీసాను కేవలం ఏదో బట్టీ పట్టినట్లు కాకుండా.. నోట్లో నుంచి గడగడ వస్తున్నట్లు మీకు ఈ వీడియో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతని కళ్ళల్లో భక్తి పారవశ్యంతో పాటు ఏకాగ్రత అందర్నీ కట్టిపడేస్తోంది.

 ఈ వీడియోను ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అతి తక్కువ సమయంలోనే లక్షలాది వ్యూస్‌తో పాటు లైకులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారతీయులు ఈ వీడియోను ఎక్కువగా ఇతరులకు షేర్ కూడా చేస్తున్నారు.. ఈ వీడియో చూసిన చాలామంది హనుమాన్ భక్తులు కామెంట్లు కూడా పెడుతున్నారు. భక్తి భావన కి దేశాలతో పాటు భాషల హద్దులు ఉండవని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తుంటే. మరి కొంతమంది జై శ్రీరామ్, జై బజరంగబలి అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు..

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES