• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!

ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!

ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనలకు ఆ దేశపు వలస విధానాలే ప్రధాన కారణమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ అతి త్వరలోనే ముస్లిం నగరంగా మారిపోతుందని పేర్కొంటూ, సరిహద్దుల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడికి సూచించారు. అక్రమ వలసలను అడ్డుకోకపోతే యూరప్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Written ByRenuka Godugu
Published: Oct 20, 2026, 08:05 AM IST|Updated: Oct 20, 2026, 08:09 AM IST
joinshare
ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!
Image Credit: Donald Trump France Comments:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
షడాష్టక యోగం 2026 పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. సింహం, మకరం, ధనుస్సు రాశులకు ఎలాంటి ఫలితాలు?

షడాష్టక యోగం 2026 పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. సింహం, మకరం, ధనుస్సు రాశులకు ఎలాంటి ఫలితాలు?

2

దసరా వేళ మటన్ ధరలు షాక్.. కిలో రూ.1,200 వరకు.. చికెన్ రేట్లు ఎంతంటే?

3

ఇకపై స్టాక్ మార్కెట్ చార్ట్స్ చూడక్కర్లేదు.. నిమిషాల్లో రిజల్ట్ ఇచ్చే మైండ్ బ్లోయింగ్ AI సాధనం?!

4

గురుగ్రహం తిరోగమనం.. ఏప్రిల్ 13 వరకు ఈ 3 రాశులకు అదృష్టం కలిసొస్తుందా?

5

నవంబర్ 12 నుంచి ఈ 3 రాశులకు అదృష్టమే అదృష్టం.. మార్చి 9 వరకు కుజుడి బంపర్‌ జాక్‌పాట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Donald Trump France Comments: ఫ్రాన్స్‌లో నిన్న రాత్రి వరకు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి బెల్జియం, సెర్బియా, ఇటలీ ప్రాంతాలకు కూడా వ్యాపించినట్లు సమాచారం. నిన్న రాత్రి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా, అక్కడ ఎమర్జెన్సీ విధించే అవకాశం కూడా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ అల్లర్లపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, పరిస్థితి చేయి జారకముందే సరిహద్దులను మూసివేయాలని హెచ్చరించారు. గతంలోనే తన మిత్రుడు మాక్రోన్‌కు పారిస్‌లోని వలస విధానాల గురించి, పెరుగుతున్న అల్లర్ల గురించి హెచ్చరించానని ఆయన గుర్తు చేశారు. ఈ హింసాత్మక నిరసనలకు వలసలే కారణమని విమర్శిస్తూ, పారిస్ త్వరలోనే ముస్లిం నగరంగా మారిపోతుందని, కాబట్టి సరిహద్దుల వద్ద కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇతర దేశాల ప్రజలను పెద్ద ఎత్తున ఫ్రాన్స్‌లోకి అనుమతించడం ఒక పెద్ద పొరపాటని అన్నారు. ఫ్రాన్స్‌లో క్షీణిస్తున్న పరిస్థితులకు మాక్రోన్ విధానాలే కారణమని ఆయన మండిపడ్డారు. పెరుగుతున్న జీవన వ్యయం ,ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు అల్లర్లు, మరోవైపు పెద్ద ఎత్తున దోపిడీలు జరుగుతున్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అధిక సంఖ్యలోని ప్రజలను అనుమతించడం, ఫ్రాన్స్‌ ఓపెన్‌ బార్డర్‌ పాలసీ వల్ల పారిస్ రూపురేఖలే మారిపోతున్నాయని ఆయన విమర్శించారు.

ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది?
శుక్రవారం ఒక్కసారిగా మొదలైన ఈ అల్లర్లు నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఫ్రాన్స్‌ నగరాల్లో హింస, దహనం, దోపిడీలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ అంతర్గత శాఖ మంత్రి ప్రకారం, ఈ హింసాకాండలో సుమారు 2400 మందిని అరెస్టు చేయగా, వెయ్యి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అలాగే 3000 దుకాణాలు దెబ్బతిన్నాయని ప్రకటించారు.

హింస వెనుక కారణాలు ఏమిటి?
ఫ్రాన్స్‌లో విద్యావ్యవస్థపై విద్యార్థుల్లో మొదటగా తీవ్ర అసంతృప్తి మొదలైంది. టీచర్ల కొరత, పాఠశాలలు , కళాశాలల నిర్వహణలో లోపాలు, పెరిగిన ధరలు, ప్రభుత్వ బడ్జెట్ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు కూడా ఈ నిరసనల్లో జతకడుతున్నారు. దీంతో ఈ ఉద్యమం యాంటీ-గవర్నమెంట్ ప్రొటెస్ట్‌గా మారింది. వేలాది మందితో మొదలైన ఈ నిరసనలు ప్రస్తుతం లక్షల మందికి చేరుకున్నాయి. ట్రేడ్ యూనియన్ల ప్రకారం ఈ సంఖ్య 8 లక్షల వరకు ఉండవచ్చు. అయితే, ఇది లెఫ్ట్ వింగ్ ప్లాన్ అని, 2027 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Read Also: ఫ్రాన్స్‌లో నిరసనల మంటలు.. రోడ్డుమీద మహిళ చేసిన పనికి అంతా షాక్.. వీడియో..
 

 

.@POTUS on the France riots: "Paris is going to be a Muslim city very soon, and that wasn't the deal... Emmanuel should've closed his borders a long time ago. I told him to do it." https://t.co/Ep8mzgPVq8

— Rapid Response 47 (@RapidResponse47) October 19, 2026

 

మారిపోతున్న నగర రూపురేఖలు..
హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత అందమైన పారిస్ నగరం దెబ్బతింటోంది. విద్యారంగ సంక్షోభం, జీవన వ్యయానికి వ్యతిరేకంగా యువత పోరాడుతూ చారిత్రాత్మక ప్రదేశాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వందలాది షాపుల్లో దొంగతనాలు చేస్తూ వాటిని తగులబెడుతున్నారు. అయితే, దీనిపై ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. అందులో ఆయన శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారు.. హింసకు పాల్పడుతున్నవారిని వేరుగా చూడాలన్నారు. అయితే, విధ్వంసాన్ని ఖండించారు. ప్రజాసేవలకు సంబంధించిన నిరసనలకు అర్థం చేసుకుంటున్నట్లు చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Donald Trump
World News