దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఒక హింసాత్మక ఘటన తీవ్ర కలకలం రేపింది. విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా, కో-పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీని వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉండవచ్చని ఇజ్రాయెల్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో కో-పైలట్‌తో పోరాడి ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ ఒక భారతీయుడని ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
Flight Dubai: ఆకాశంలో అలా సాగుతున్న విమాన ప్రయాణం. హఠాత్తు పరిణామం 174 మంది ప్రాణాలపై కుట్ర జరిగింది. గుర్తించిన పైలట్ గగనతలంలో ముంచుకొచ్చిన మృత్యువుతో భారత్ పైలట్ స్మిత్ మచ్చర్ పోరాటం చేశాడు. తనకు తానుగా రక్షించుకోవడమేకాదు… 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఇపుడు ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. తాను మృత్యువు నుండి బయటపడటమే కాకుండా.. ఎంతో మంది కాపాడిన వ్యక్తిగా ప్రపంచ మొత్తంతో కీర్తించబడుతున్న ఆయన ఎవరు.. ?
Iran America Ceasefire Offer: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి తెరదించేలా ఇరాన్ చేసిన కీలక ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణకు వెళ్లడం వంటి ప్రతిపాదనను ఇరాన్ అమెరికా ముందు ఉంచగా.. ట్రంప్ దాన్ని తిరస్కరించినట్లు అమెరికా అధికారులను ఉద్దేశిస్తూ కథనం వెల్లడించింది.
Pakistan Vs Indiaఫ ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. UN సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలు చేసిన పాక్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
US Sanctions Bill: అమెరికా నుండి భారత్‌కు కొత్త సుంకాల ముప్పు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే భారత్ విషయంలో, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేలా అధ్యక్షుడికి అధికారం ఇచ్చే రష్యా ఆంక్షల బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. 262-159 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆగస్టులోనే సెనెట్ దీనిని ఆమోదించగా, ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేస్తే సరిపోతుంది.