Donald Trump: 'నేను 8 యుద్ధాలు ఆపాను. నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి': డొనల్డ్ ట్రంప్
Donald Trump Once Again Hope On Nobel Peace Prize 2026: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించే నోబెల్ బహుమతిపై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి తనకే నోబెల్ బహుమతి రావాలని ఆకాంక్షించాడు. ఎందుకంటే తాను 8 యుద్ధాలు ఆపినట్లు ప్రకటించుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nobel Peace Prize 2026: ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం నోబెల్ అవార్డు. సినీ రంగంతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి నోబెల్ అవార్డు లభిస్తుంది. ఆ అవార్డుల్లో మరో కీలకమైన అవార్డు శాంతి బహుమతి. అవార్డులన్నింటిలో నోబెల్ శాంతి బహుమతి అత్యంత ప్రత్యేకతమైనది. ప్రపంచ శాంతి కోసం.. ఘర్షణ వాతావరణం తొలగించి శాంతి సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తుంటుంది. ఈ అవార్డు కోసం అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఎదురుచూస్తున్నాడు. గతేడాది నుంచి నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వాలని కోరుతూ వస్తున్న అతడు ఈసారి కూడా తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు.
ఈ ఏడాది తనకు నోబెల్ శాంతి ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కోరుతున్నాడు. తనకు శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలనేది దానికి కారణాలు కూడా చెప్పాడు. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకొచ్చిన ట్రంప్.. దీంతో నోబెల్ శాంతి బహుమతికి తాను పూర్తిగా అర్హుడినని ప్రకటించుకున్నాడు. తాను ఎలాంటి గొప్పలు చెప్పుకోవడం లేదని.. ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నట్లు ట్రంప్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్లు స్వయంగా ప్రకటించుకున్నాడు.
ప్రపంచంలో ఎవరూ చేయలేని గొప్ప పనులు తాను చేశానని చెప్పిన ట్రంప్.. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలకు పరిష్కారం చూపించి ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. ఇవన్నీ కారణాలతో తాను నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడినని పునరుద్ఘాటించారు. అయితే ఈ పురస్కారం తనకు వస్తుందనే నమ్మకం మాత్రం చాలా తక్కువేనని చెప్పడం విశేషం. తనలాంటి వారికి నోబెల్ శాంతి బహుమతి అవార్డు ఇవ్వకపోవడమే నార్వేజియన్ నోబెల్ కమిటీకి అలవాటుగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా 2026 సంవత్సరానికి నోబెల్ అవార్డులు వరుసగా ప్రకటిస్తుండగా.. ఇప్పటికే పలు రంగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనున్నారు. ఈసారి బహుమతి కోసం ఆరాటపడుతున్న డొనల్డ్ ట్రంప్‌కు నోబెల్ పురస్కారం లభిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ నోబెల్ శాంతి బహుమతి ఎవరికీ వస్తదనేది ఉత్కంఠ నెలకొంది.