• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /ఫిట్‌గా ఉన్నా గుండెపోటు? 32 ఏళ్లకే 2 స్టెంట్లు.. యువతకు షాకింగ్ హెచ్చరిక!

ఫిట్‌గా ఉన్నా గుండెపోటు? 32 ఏళ్లకే 2 స్టెంట్లు.. యువతకు షాకింగ్ హెచ్చరిక!

Preventive Heart Checkup: 35 ఏళ్లు కలిగిన సౌమిత్ బిశ్వాస్ అనే వ్యక్తి ఫిసికల్‌గా బాగా ఫిట్నెస్‌గా ఉన్నప్పటికీ.. తన శరీరం లోపల ఉండే గుండె హెల్తీగా ఉందో లేదో కనిపెట్టలేకపోయారు. అయితే అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళ్ళగా.. వైద్యులు అతని గుండెకు రెండు స్టంట్లేసి పంపించారు. ఈ ఘటనను అతను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 06:14 PM IST|Updated: Oct 08, 2026, 06:15 PM IST
joinshare
ఫిట్‌గా ఉన్నా గుండెపోటు? 32 ఏళ్లకే 2 స్టెంట్లు.. యువతకు షాకింగ్ హెచ్చరిక!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Instagram మ్యూజ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!

Instagram మ్యూజ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు.. అవేంటో మీరు కూడా తెలుసుకోండి!

2

Vijayasai Reddy: టీటీడీలో రాజకీయ నాయకులకు స్థానం లేకుండా చేస్తా: విజయసాయి రెడ్డి

3

‘బా బా బ్లాక్ షీప్’ మూవీపై మేఘాలయ సీఎం ప్రశంసలు.. సినిమాలో అంతగా ఏముందంటే..?

4

ఫిట్‌గా ఉన్నా గుండెపోటు? 32 ఏళ్లకే 2 స్టెంట్లు.. యువతకు షాకింగ్ హెచ్చరిక!

5

పెద్దపెల్లి జిల్లాలో 15 మంది వరుస మరణాలతో గ్రామంలో భయం.. ఇళ్లకు తాళాలు వేసి ఊరు ఖాళీ చేసిన జనం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heart Health Screening: ఒకప్పుడు గుండె జబ్బులు అంటేనే కేవలం వృద్ధాప్యంలోనో.. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిలోనూ ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పూర్తి ఆరోగ్యంగా కనిపించే యువత సైతం గుండెపోటు బారిన పడి మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నాయి. గుండెపోటు రావడానికి కేవలం వయస్సు.. పైకి కనిపించే శరీరక దృఢత్వంతో సంబంధం లేదని సౌమిత్ బిశ్వాస్ అనే 32 ఏళ్ల యువకుడి అనుభవం మరోసారి నిరూపించింది.

కేవలం 32 ఏళ్ల వయస్సు కలిగిన అతనికి గుండె రక్తనాళాల్లో తీవ్ర అడ్డంకులు ఏర్పడడంతో రెండు స్టంట్ లు వేయించుకోవాల్సి వచ్చిందని సౌమిత్ బిశ్వాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.. తాను సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ.. శరీరంలో సీక్రెట్ గా దాగి ఉన్న గుండె సమస్యలు అస్సలు బయటపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు.. పైకి చురుగ్గా ఉన్నప్పటికీ.. ఆరోగ్యంగా అనిపించినంత మాత్రాన గుండె పూర్తిగా భద్రంగా ఉన్నట్లు కాదని.. అంతర్గత ప్రమాదాలను సకాలంలో గుర్తించాలని ఆయన యువతను హెచ్చరిస్తూ వచ్చారు..

ముఖ్యంగా సౌమిత్ ఎక్స్పీరియన్స్ వెలుగులోకి రావడం వల్ల ప్రముఖ గుండె వైద్య నిపుణులు సైతం యువతకు కీలకమైన సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ఒక్కరు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా లైపోప్రొటీన్-A (Lp(a)) రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. దీని ద్వారా అనేక విషయాలు బయటపడతాయని వారు చెబుతూ వస్తున్నారు..

ఈ టెస్ట్ అనేది శరీరంలో జన్యుపరంగా ఉండే ఒక రకమైన కొలెస్ట్రాల్ కణం.. రక్తంలో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే ధమనులలో కొవ్వు పేరుకుపోయి.. రక్తం గడ్డకట్టే ప్రమాదం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఇది సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షల్లో స్పష్టంగా బయటపడకపోవచ్చు.. జన్యుపరమైన కారణాల వల్ల సాధారణ జీవన శైలి పాటించే వారిలో కూడా దీని స్థాయిలు ఎక్కువగా ఉండే ఛాన్సులు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం జిమ్ములతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ పై మాత్రమే ఆధారపడకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్టులు సైతం సూచిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా రక్తపోటుతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలను, కొలెస్ట్రాల్ పరిమాణాలను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు రోజువారి మానసిక ఒత్తిడిని తగ్గించి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం మంచిదని వారు సూచిస్తూ వస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Health