SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

India Oil Strategy News: భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వాణిజ్యం అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.. ఒకవైపు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు చేసుకొని.. రిఫైనరీల ద్వారా వివిధ పెట్రోలియం ప్రొడక్ట్స్ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ విదేశీ మారకద్రవ్యం నిలువలను పెంచుకుంటూ వస్తోంది. రష్యా ఆయిల్స్ బహిష్కరిస్తున్నప్పటికీ.. రిఫైనరీల ద్వారా భారత్ పెట్రోలియం ప్రొడక్ట్స్ యూరోపియన్ దేశాలు మెండుగా కొనుగోలు చేస్తున్నాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 09:00 PM IST | Updated: Oct 18, 2026, 09:01 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

India Oil Strategy: అంతర్జాతీయ చమూరు మార్కెట్లో భారత్ తన వ్యూహాత్మక వాణిజ్యంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలకే.. భారత్ తిరిగి శుద్ధిచేసిన రష్యా చమురు ఉత్పత్తులను భారీ పరిమాణంలో విక్రయించడం విశేషం.. గ్లోబల్ ఎనర్జీ ట్రాకర్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ హెయిర్ విడుదల చేసిన తాజాగణంకాల ప్రకారం.. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో భారత రిఫైనరీల నుంచి పశ్చిమ దేశాలకు చమురు ఎగుమతులు ఏకంగా 43 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది..

అంతర్జాతీయ వాణిత్య నిబంధనల ప్రకారం.. రష్యా నుంచి నేరుగా వచ్చే ముడి చెమరుపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నా.. అయితే,  ముడిచమురును మరొక దేశం కొనుగోలు చేసి.. తమ రిఫైనరీలలో శుద్ధిచేసి పెట్రోల్ తో పాటు డీజిల్ ఏవియేషన్ ఫ్యూయల్ వంటి ఉత్పత్తులుగా మార్చినప్పుడు ఆ ఉత్పత్తుల మూలం పూర్తిగా మారుతుంది.. నిబంధనలలో రిఫైనరీ స్థాయిలలో ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో.. భారత్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటర్నేషనల్ ప్రమాణాలకు అనుగుణంగా చట్టబద్ధంగానే ఎగుమతులను కొనసాగిస్తూ వస్తుంది.

ఈ మొత్తం ఎగుమతులలో భారత్ ప్రైవేట్ దిగ్గజ రెఫైనరీలు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి.. ముఖ్యంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ ఒక్కదాని నుంచే దాదాపు 122 మిలియన్ యూరోల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు పశ్చిమ దేశాలకు ఎగుమతులు కావడం విశేషం.. ఈ ఉత్పత్తులలో అత్యధిక శాతం రష్యా నుంచి రాయితీ ధరకు దిగుమతి చేసుకున్న ముడిచమురు నుంచి తయారైనట్లు నివేదికను స్పష్టం చేస్తూ వస్తున్నాయి.

ఒకవైపు రష్యా ఆయిల్స్ ను బహిష్కరిస్తున్నామని చెబుతున్న యూరోపియన్ దేశాలు.. తమ దేశాల్లోని ఇంధన కొరత కాకుండా ఉండేందుకు భారత్ నుంచి శుద్ధి చేసిన ఆయిల్ ను ఇలాంటి అభ్యంతరం లేకుండా కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. వ్యూహాత్మక లావాదేవీల వల్ల అటు పశ్చిమ దేశాలకు ఇంధన కొరత తగ్గుతుండడంతో పాటు ఇటు భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం లభించడం, దేశీయ రిఫైనరీ రంగానికి భారీ ఆర్థిక ప్రయోజనం ఏ కోరుతూ వస్తోంది. బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ భారత్ అనుసరిస్తున్న ఈ వాణిజ్య విధానం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటూ వస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES