• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

మన భారతీయ వంటగదిలో ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా కుక్కర్ ఉండాల్సిందే. పప్పు క్షణాల్లో ఉడకాలన్నా లేదా అన్నం మెత్తగా అవ్వాలన్నా మనకు మొదటగా కుక్కరే గుర్తుకు వస్తుంది. అయితే ఈ కుక్కర్లలో స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే, అల్యూమినియం ఏది రోజువారీ వంటలకు ఉపయోగపడుతుంది మరియు ఏది ఆరోగ్యకరం అనేది మీకు తెలుసా?

Written ByRenuka Godugu
Published: Oct 18, 2026, 07:49 PM IST|Updated: Oct 18, 2026, 07:51 PM IST
joinshare
అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!
Image Credit: Aluminium vs Stainless Steel Pressure Cooker

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

2

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

3

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

4

ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!

5

AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ప్రతిరోజూ ఉదయం ఆఫీసులకు లేదా స్కూళ్లకు వెళ్లే సమయంలో వంట త్వరగా పూర్తి చేయాలనే హడావుడిలో ఉంటాం. ఈ క్రమంలోనే అందరిలో రైస్ కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఉదయాన్నే త్వరగా పప్పు ఉడకాలని, అన్నం అవ్వాలని ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుక్కర్లనే ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల క్షణాల్లో వంట పూర్తవుతుంది, గంటల తరబడి పప్పు ఉడికే వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. కానీ అల్యూమినియం కుక్కర్ vs స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లలో రోజువారీ వంటలకు ఏది మంచిది, ఏది అనారోగ్యకరం అనేది తెలుసుకోవాలి.

అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ల ధరల్లో, మెటీరియల్, మన్నికలో తేడాలు ఉంటాయి. అలాగే వంట చేసే పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ రెండిటిలో భారతీయ వంటగదికి, రోజువారీ వంటలకు ఏది సరిపోతుందో ఇప్పుడు చూద్దాం.
అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ ఎన్నో ఏళ్లుగా వంటగదిలో వాడుకలో ఉంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. సాధారణంగా షాపుల్లో బడ్జెట్ ధరలోనే సులభంగా దొరుకుతుంది. ఇది త్వరగా వేడెక్కుతుంది కాబట్టి, రోజువారీ పప్పులు, కూరగాయలు ఉడికించుకోవడానికి అల్యూమినియం కుక్కర్ సరిపోతుంది.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

అయితే అల్యూమినియం కంటే మన్నికైనది కావాలనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాల్సిందే. ఇది కూడా మీ రోజువారీ వంటల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మనం ఆసిడ్ ఫుడ్స్ వండుతుంటాం. కాబట్టి, సులభంగా నిర్వహించడానికి స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అందుకే చాలామంది కాలక్రమేణా అల్యూమినియం కంటే స్టెయిన్లెస్ స్టీల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్యూమినియం కుక్కర్ బరువు తక్కువగా ఉండటం వల్ల సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ఇది త్వరగా హీట్ అవుతుంది. మూత పెట్టగానే వెంటనే లోపల ప్రెషర్ ఏర్పడుతుంది. దీనివల్ల వంట సమయం ఆదా అవుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ కంటే దీని ధర తక్కువ కాబట్టి, బడ్జెట్‌లో ఉండటం వల్ల రోజువారీ ఇండియన్ కుకింగ్ అన్నం, పప్పు కోసం ఇది బెస్ట్.

అయితే, అల్యూమినియం కుక్కర్‌ను శుభ్రం చేసేటప్పుడు స్క్రాచ్ పడే అవకాశం ఉంది. ఇది మన్నికైనదే అయినప్పటికీ, కొన్ని ఆసిడ్ ఫుడ్స్ వండటం మంచిది కాదు. ఇక స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ విషయానికి వస్తే, ఇది కూడా త్వరగా వేడెక్కుతుంది మరియు మన రోజువారీ వంటలకు చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది దీనినే ఉపయోగిస్తున్నారు. ఇది అల్యూమినియం కంటే బెట్టర్‌. మందంగా కూడా ఉంటుంది. దీని ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రోజువారీ వంటలకు ఇది బెస్ట్. దీనిని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు యాసిడిక్ ఫుడ్స్ కూడా సులభంగా వండుకోవచ్చు. అయితే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కొనేటప్పుడు ధర కొంచెం ఎక్కువే ఉంటుంది. వంట చేసేటప్పుడు మంటను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే వంట మాడిపోయే ప్రమాదం ఉంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Home Remedies
Health