ప్రాణాలు కాపాడే ఆర్టిఫిషియల్ బ్లడ్.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం!
Japan Artificial Blood Telugu: వైద్యరంగంలో జపాన్ మరో కీలకమైన అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. నారా యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే క్లినికల్ ట్రైల్స్ కూడా నిర్వహించినట్లు వారు తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Japan Artificial Blood Telugu News: వైద్యరంగంలో ప్రాణాలను కాపాడే సరికొత్త ఆవిష్కరణల దిశగా జపాన్ పరిశోధకులు వేస్తున్న అడుగు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యవసర సమయాల్లో రక్తం కోరతను అధిగమించే లక్ష్యంతో జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ బ్లడ్ అభివృద్ధిలో కీలకమైన మైలురాయిని చేరుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అయితే, ఈ పరిశోధనలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వివిధ అంశాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నారా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రత్యేకంగా హిమోగ్లోబిన్ వెసికల్స్ అనే కృత్రిమ ఎర్ర రక్త కణాలను తయారు చేశారట.. శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్ ను సరఫరా చేయడమే వీటి ప్రాథమిక లక్ష్యం.. ఈ ఆవిష్కరణలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. దీనికి ఎలాంటి బ్లడ్ గ్రూపులతో సంబంధం ఉండదట.. సాధారణంగా రక్త మార్పిడి చేసేటప్పుడు గ్రూప్ కు సరిపోలేకపోతే.. రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.. కానీ ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ రక్త కణాల వినియోగానికి గ్రూప్ మ్యాచ్ కావలసిన సంబంధం అస్సలు లేదట..
అంతేకాకుండా.. సహజ రక్తాన్ని నిల్వ చేయడానికి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో కోల్డ్ స్టోరేజ్ వసతులు ఎంతగానో అవసరం పడుతూ ఉంటాయి.. కానీ పరిశోధకులు రూపొందించిన ఈ హిమోగ్లోబిన్ వెసికల్స్‌ను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు రెండేళ్ల పాటు నిల్వ ఉంచొచ్చట.. దీనివల్ల భూకంపాల సమయాల్లో, ముఖ్యంగా విపరీతమైన విపత్తులు, యుద్ధాలు వచ్చినప్పుడు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయని యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు..
అయితే, ఈ సాంకేతికతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులకు వాస్తవాలకు పొంతన లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రక్తాన్ని ఎక్కించుకుంటే మనుషుల ఆయుష్ అమాంతం పెరుగుతుందని వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని. తీవ్ర రక్తస్రావం జరిగిన అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి రక్షించడానికి.. తాత్కాలికంగా ఆక్సిజన్ సరఫరాను అందించడానికి మాత్రమే దీనిని వినియోగించవచ్చని వారు చెబుతున్నారు..
ప్రస్తుతం ఈ సాంకేతికత ఇంకా ప్రయోగ దశలోనే కొనసాగుతోంది. ఆరోగ్యవంతమైన వాలెంటీర్లపై క్లినికల్ ట్రైన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జపాన్ ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఇది సాధారణ రక్తదానానికి శాశ్వత ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి రాబోతున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.