SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జావా సముద్రంలో ఘోర నౌక ప్రమాదం.. 129 మంది గల్లంతు!

Java Sea Ship Accident News: జావా సముద్రంలో చోటు చేసుకున్న నౌక ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా గల్లంతయినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే అధికారులు 100 మందికి పైగా ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు చేర్చారు.. అయితే, ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.. కానీ నౌక మునిగిపోతున్న సమయంలో తీసిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 14, 2026, 01:46 PM IST | Updated: Sep 14, 2026, 01:49 PM IST
Image Credit: జావా సముద్రంలో ఘోర నౌక ప్రమాదం.. 129 మంది గల్లంతు!
Join

Java Sea Ship Accident Telugu News: జావా సముద్ర జలాల్లో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది.. భారీ సంఖ్యలో ప్రయాణికుల తో పాటు సిబ్బంది ప్రయాణిస్తున్న నౌక ఒక్కసారిగా తిరగబడి సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.. మరో 129 మంది ఆచూకీ గల్లంతయ్యింది.. నౌక నీటిలో ములుగుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అసలు ఈ నౌక ఇలా మునిగిపోవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేసే వర్గో ట్రాన్స్పోర్ట్ నౌక మొత్తం 243 మందితో బయలుదేరింది.. ప్రయాణం మధ్యలో జావా సముద్ర పరిధిలోకి చేరుకోగానే అనుకోని రీతిలో ఆ నౌక ఒక్కసారిగా బోర్ల పడిపోయింది.. కొద్ది క్షణాల్లోనే ఆ భారీ నౌక పూర్తిగా జల సమాధి అయిపోయింది.. ఆచారం అందుకున్న రక్షణ దళాలు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగారు. అంతేకాకుండా అక్కడే స్థానికంగా ఉన్న కొన్ని బోట్లు కూడా రంగంలోకి దిగి ప్రత్యేకమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ మొత్తం నౌకలో దాదాపు సిబ్బందితో పాటు ప్రయాణికులు 243 మంది ఉండగా.. అధికారులు ఇప్పటికే 108 మందిని సురక్షితంగా కాపాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో భాగంగా 6 మృతదేహాలను కూడా వెలిక్కి తీశారట. ఇక 129 మందికి పైగా గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు.. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంతో చాలామందిని రక్షించినట్లు అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్షించిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు కూడా తరలించారట. ఇక గల్లంతయిన వారి కోసం అధికారులు ప్రత్యేకమైన గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు.

గల్లంతైన వారికోసం అధికారులు దాదాపు 12 ప్రత్యేకమైన నౌకలతో పాటు దాదాపు 62 మంది నిపుణులైన సహాయక సిబ్బందిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆధునిక పరికరాలతో పాటు డ్రైవర్ల సహాయంతో సముద్రంలోని ప్రతి అంగుళాన్ని గాలిస్తున్నారట.. సముద్రపు పోటుతో పాటు ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగించినప్పటికీ.. సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు..

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

నౌక ప్రమాదానికి గురై మునిగిపోతున్న సమయంలో కొందరు ప్రయాణికులు.. సమీప బోట్లో ఉన్నవారు వారి మొబైల్ తో ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వీడియో క్షణాల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది.. అయితే ఈ వీడియోలో ఆ నౌక దానికి అదే బోల్తా కొట్టి సముద్ర గర్భంలోకి కలిసిపోవడంతో పాటు అందులో ఉన్న ప్రయాణికులు దాన భయంతో అరుపులు కేకలు పెట్టడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES