Video Viral: ఇదెక్కడి అరాచకం.. ఒకే రాత్రి నలుగురు అమ్మాయిల్ని పెళ్లాడిన వరుడు.. వీడియోపై నెట్టింట రచ్చ..
Man marries four women video: నలుగురిని వ్యక్తి ఒకే వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Man allegedly marries four women in Pakistan video: సోషల్ మీడియాలో ఇటీవల ఫన్నీ వీడియోలు బాగా ట్రెండింగ్ గా మారుతున్నాయి. కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే షాక్ కు గురిచేసేలా ఉంటాయి. చాలా మంది ఇటీవల ఎక్కడైన వింత ఘటనలు జరిగితే వెంటనే వాటిని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లకు చెందిన అనేక వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. కొంత మంది కావాలనిచేస్తున్నారో లేదా పబ్లిసిటీ స్టంట్ ల కోసం చేస్తున్నారో తెలీదు కానీ తమ పెళ్లివేళ చోటుచేసుకున్న ఘటనల్ని కాస్త వైరల్ చేస్తున్నారు.
తాజాగా.. ఒక వ్యక్తి నలుగురు యువతుల్ని ఒకే వేదిక మీద పెళ్లాడిన వీడియో ట్రెండింగ్ గా మారింది. దీనిలో సదరు వ్యక్తి నలుగురిని ఒకే రాత్రిలో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వేదిక మీద నలుగురు అమ్మాయిల్ని చేతిలో చెయ్యి ఇచ్చి మరీ సదరు వ్యక్తి తీసుకొని రావడం వీడియోలో కన్పిస్తుంది. ఈ పెళ్లి వేడుకకు స్నేహితులు, బంధువులు కూడా భారీగా హజరయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి ఒక పెళ్లి అవ్వడానికి గగనమైందని, అలాంటిది నలుగుర్ని ఎలా పెళ్లాడుతున్నావ్ భయ్యా..?.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.