• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఈ రోజుల్లో ఏదైనా గుర్తింపు కార్డు ఉండటం ముఖ్యం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ వంటివి తప్పనిసరి అయ్యాయి. వీటిలో ఓటర్ ఐడి ఎంతో కీలకమైనది. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందుకే ఇది చాలా ముఖ్యం. ఓటర్ ఐడిని ఆన్లైన్‌లో మీరు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Written ByRenuka Godugu
Published: Nov 24, 2026, 18:30 IST|Updated: Nov 24, 2026, 18:32 IST
joinshare
మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Image Credit: Voter ID Card Download:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

2

Seethakka Apology: కవితపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన తెలంగాణ మంత్రి సీతక్క

3

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

4

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

5

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Voter ID Card Download: ఓటర్ ఐడీని ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మీరు మీ వివరాలను అప్‌డేట్ చేసుకున్నప్పుడు, ఎపిక్ కార్డును కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్ కార్డు మాదిరిగానే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డు వంటివి కూడా కీలకమైనవే. ఓటర్ ఐడి మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, ఇది ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాల్సిందే. దీనిని ఆన్‌లైన్‌లో కూడా సులభంగా కాపీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడీపై ఎపిక్ (E-pic) నంబర్ ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్ ఆధారంగా మీరు ఈసీఐ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://voters.eci.gov.in/ ఓపెన్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఎపిక్ నంబర్ ఆధారంగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్‌ను కూడా నమోదు చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ "డౌన్‌లోడ్ ఈ-ఎపిక్" అనే ఎంపిక కనిపిస్తుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, ఎపిక్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కూడా నమోదు చేసిన తర్వాత "రిక్వెస్ట్ ఓటీపీ"  ఎంచుకోండి. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి "వెరిఫై అండ్ లాగిన్" క్లిక్ చేయండి. మరో కొత్త స్క్రీన్ వస్తుంది. అక్కడ ఎపిక్ నంబర్‌ను ఎంటర్ చేసి, మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. తర్వాత సెర్చ్ చేస్తే ఓటీపీ ప్రక్రియ ముందుకు సాగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి వెరిఫై చేయండి. ఒకసారి వెరిఫై అయిన తర్వాత మీ ఎపిక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పిడిఎఫ్ ఫైల్ రూపంలో కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోండి. అవసరమైతే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

మన దేశంలో ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటు తప్పనిసరిగా కలిగి ఉండాలి. 18 ఏళ్లు పైబడిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తమకు ఇష్టమైన పార్టీని ఎంచుకోవచ్చు. అయితే ఈ ఓటర్ ఐడి మన దేశంలో ఒక గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. కేవలం ఓటర్ ఐడి ఉన్నంత మాత్రాన అది జాతీయతను రుజువు చేయదని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు కొన్ని ఇతర ఆధారాలను కూడా తీసుకుంటేనే జాతీయతను రుజువు చేసుకోవచ్చు. ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ వంటివి కలిగి ఉండటం తప్పనిసరి. ఇవన్నీ ఒక వ్యక్తికి గుర్తింపు కార్డులుగా ఉపయోగపడతాయి. వీటి ఆధారంగానే ఒక దేశ పౌరసత్వాన్ని కూడా రుజువు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. అంతేకాకుండా, ఫిజికల్ కాపీని డౌన్‌లోడ్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో డిజిటల్ కాపీలను కూడా భద్రపరుచుకునే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News