SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పశ్చిమాసియా సంక్షోభం.. ఆకాశానికి చమురు ధరలు..

Middle East War:పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక మోగుతోంది. హార్మూజ్ మార్గం నుంచి వెళుతున్న చమురు ట్యాంకర్లు, నౌకలపై ఇరాన్‌ దాడులు చేస్తుండటం, ఇరాన్‌పై మరోసారి భారీ దాడికి దిగాలని అమెరికా, ఇజ్రాయెల్‌ యోచిస్తున్నట్టుగా వస్తున్న వార్తలతో ఒకవైపు.. సౌదీ ఆరామ్‌కోపై హుతీల దాడులు, సౌదీ, యెమెన్‌ దళాల దాడులతో మరోవైపు తీవ్ర ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. దీంతో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 09:03 AM IST | Updated: Oct 23, 2026, 09:06 AM IST
Image Credit: Middle East War (ZEE News Telugu/Source)
Join

Crude Oil Rates Very High: పశ్చిమాసియాలో యుద్ద సంక్షోభం చమురు ధరలపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ప్రస్తుతం ఒక్కో బ్యారెల్‌ ధర 112డాలర్లకు చేరింది. హోర్ముజ్‌లో, ఎర్ర సముద్రంలో, సౌదీలో జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది కూడా ప్రభావితం కావడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆరామ్ కో చమురు క్షేత్రంపై దాడి.. 

సౌదీ అరేబియాలోని కీలకమైన ఆరామ్‌కో చమురు కేంద్రం, దమ్మామ్‌లోని కింగ్‌ ఫాహద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై హుతీలు గురువారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగారు. ఇరు ప్రాంతాల్లోనూ పేలుళ్లు సంభవించి, మంటలు చెలరేగాయి. దమ్మామ్‌ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు మృతిచెందారు.  మరో ఇద్దరు భారతీయులు సహా 8మంది గాయపడ్డారని... ఆరామ్‌కో చమురు క్షేత్రంపై దాడిలో ఇంకో భారతీయుడు సహా పలువురు గాయపడ్డారని సౌదీ  ప్రకటించింది. మరో వైపు  రెడ్ సీలో 14 మంది భారతీయులు ప్రయాణిస్తున్న పడవపై సౌదీ అరేబియా దాడి చేసిందని హుతీలు గురువారం ప్రకటించారు. జుఖర్‌ దీవి సమీపంలో భారతీయులున్న పడవపై సౌదీ దాడి చేసిందని, యెమెన్‌ నౌకాదళం వారందరినీ రక్షించిందని హుతీల ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. అయితే ఈ విషయాన్ని సౌదీగానీ, భారత్‌ గానీ ఇంకా ధృవీకరించలేదు. కాగా, సౌదీ దమ్మామ్‌ ఎయిర్‌పోర్టుపై హుతీల దాడులను భారత విదేశాంగ శాఖ ఖండించింది. పౌర, ఇంధన మౌలిక వసతులపై దాడులు సరికాదని పేర్కొంది.

తాము చేసిన దాడుల్లో, సముద్రపు మందుపాతరల (సీమైన్స్‌)ను ఢీకొని 7 చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నట్టు ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌(ఐఆర్‌జీసీ) గురువారం ప్రకటించింది. గల్ఫ్‌లో నాలుగు చమురు నౌకలపై తమ నావికాదళం దాడి చేసిందని.. హోర్ముజ్‌లో సీమైన్లను ఢీకొని మూడు చమురు ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయని తెలిపింది. అమెరికా ఇలాగే చమురు నౌకలను హోర్ముజ్‌ దాటించడానికి ప్రయత్నిస్తుంటే.. పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై దాడులకు దిగుతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో ఒమన్‌ తీరానికి సమీపంలో కువైట్‌ జెండాతో ప్రయాణిస్తున్న అల్‌ దస్మా చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో 21 మంది భారతీయులు సహా 40 మంది వరకు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ దాడిలో ప్రాణ నష్టమేదీ జరగలేదు.

ఇజ్రాయిల్‌లో సాధారణ ఎన్నికలు.. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. 
త్వరలో ఇజ్రాయెల్‌లో సాధారణ ఎన్నికలు, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎన్నికలు నెతన్యాహుకు, అమెరికాలో ఎన్నికలు ట్రంప్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో ప్రజల్లో మద్దతు పెంచుకునేందుకు వారు ఇరాన్‌పై మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇరాన్‌పై అమెరికా దాడులతో హోర్ముజ్‌లో రవాణా నిలిచిపోవడం, ఇటు ఎర్రసముద్రంలో సమస్యలతో అంతర్జాతీయంగా చమురు రవాణాపై ప్రభావం పడింది. చమురు ధరలు ఎగిసి పడుతున్నాయి. గురువారం ఏకంగా బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరాయి. మరోవైపు, హుతీలు ఇటీవల సౌదీలోని కీలక విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలపై దాడులు మొదలుపెట్టారు. కీలకమైన బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిపై పట్టు సాధించారు. దీనివల్ల కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES