Saudi Arabia Houthi Conflict News: మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణ మరింత వేడెక్కిందని చెప్పొచ్చు.. సౌదీ అరేబియా పై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు తీవ్రతరం చేయడంతో.. ఆ ప్రాంతంలో ఊహించని సరికొత్త సైనిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. సౌదీ అరేబియా కు సపోర్టుగా నిలిచేందుకు సిరియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హౌతీలను అణచివేసేందుకు లక్ష్యంగా సౌదీ చేసిన విజ్ఞప్తి మేరకు సుమారు 20,000 మందికి పైగా సిరియా సైనికులు యెమెన్ యుద్ధ రంగంలోకి దిగబోతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు రాస్కొస్తున్నాయి.
ఇటీవలే సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని హౌతీయులకు సంబంధించిన తిరుగుబాటుదారులు ఊహించని దాడులకు పాల్పడ్డారు. ఈ అనుకోని దాడుల్లో భాగంగా ముగ్గురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ అధికారికంగానే ప్రకటించింది. ఈ ఘటనతో సౌదీ అరేబియా తన భద్రత వ్యవస్థను మరింత కట్టుదిట్టడం చేయడంతో పాటు హౌతీల స్థావరాలపై కూడా ప్రత్యక్ష చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. పౌరుల ప్రాణాలను తీసిన ఈ దాడి అనంతరం ప్రాంతీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది..
ఈ సంక్షోభ సమయంలో సౌదీకి మిత్ర దేశాల నుంచి భారీగా రక్షణ సపోర్ట్ లభిస్తూ వస్తోంది. పవిత్ర నగరాల రక్షణతో పాటు పరస్పర సైనిక సహకారం కోసం చేస్తున్న చారిత్రక మక్కా ఒప్పందం మేరకు ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు తుర్కీ తమ సైనిక బలగాలను సౌదీ అరేబియాకు తరలించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ దేశాలు సౌదీ భూభాగ భద్రతలో కీలక బాధ్యతలను స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీకి అద్భుతమైన రక్షణగా నిలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి..
మరోవైపు సౌదీ అభ్యర్థన మేరకు సిరియా ఏకంగా 20,000 మంది అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన సైనికులను యెమెన్‌లో హౌతీలపై పోరాడేందుకు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఊహించని స్థాయిలో వార్తలు వచ్చాయి. సిరియా ప్రభుత్వం నేరుగా ఈ యుద్ధం లో భాగస్వామ్యం కాబోతుండడంతో మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో అనూహ్య పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తూ వస్తున్నారు.
సరిహద్దుల ఘర్షణలతో అట్టడికి పోతున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోకి సిరియా బలగాలు కూడా ప్రవేశిస్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యెమెన్ యుద్ధభూమిలో హౌతి తిరుగుబాటుదారులు. పరదేశాల సైనికుల కూటముల మధ్య పోరు మొదలైతే ఈ ఉద్రిక్తతలు ప్రపంచశాంతికి.. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంత ఆర్థిక స్థిరత్వానికి తీవ్రంగా సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తూ వస్తున్నారు..