SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Donald Trump: నార్వే దేశానికే ఇది సిగ్గుచేటు.. నోబెల్ శాంతి బహుమతిరాకపోవడంపై ఆక్రోశం వెళ్ల గక్కిన డొనాల్డ్ ట్రంప్..

Trump on nobel peace prize: నోబెల్ శాంతి బహుమతి ఈసారైన తనను వరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఈసారి దక్షిణాఫ్రికా మానవ హక్కుల న్యాయ నిపుణురాలు నవీ పిళ్ళైను నోబెల్ శాంతి బహుమతి వరించింది.

Written By Inamdar Paresh
Published: Oct 10, 2026, 10:40 AM IST | Updated: Oct 10, 2026, 10:49 AM IST
Image Credit: donaldtrump(file)
Join

Donald Trump criticizes on norway after not receiving Nobel peace prize: నోబెల్ శాంతి బహుమతిని ఇటీవల నార్వేజియన్ కమిటీ దక్షిణాఫ్రికా మానవ హక్కుల కోసం పోరాడిన న్యాయ నిపుణురాలు నవీ పిళ్ళైకు ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ మేరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీ పిళ్లైకు ఈ పురస్కారం ను ప్రకటిడంతో నోబెల్ శాంతి బహుమతి తన స్థాయిని తగ్గించుకుందని అన్నారు. 

నవీ పిళ్ళై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను తీవ్రంగా ద్వేషిస్తారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హమాస్‌కు అండగా నిలిచారని విషయంను గుర్తు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందని ఆమె నేతృత్వంలోని ఐరాస కమిషన్ నివేదించడాన్ని "హస్యంతో కూడుకున్నది"గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నిజానికి నాగరికతకు శత్రువులైన కొద్దిమంది తీవ్రవాద భావజాలపరుల వల్ల నోబెల్ శాంతి బహుమతి పూర్తిగా అపఖ్యాతిపాలైందని అన్నారు. 

ఇప్పటి వరకు ఎనిమిది యుద్దాలను ఆపిన తనను కాదని  ఇతరులకు నోబెల్ బహుమతి ఇవ్వడం నార్వేదేశానికి సిగ్గుచేటని ట్రంప్ అభివర్ణించారు. తన అధ్యక్ష పదవీకాలంలో ప్రతి సంవత్సరం కూడా నోబెల్ శాంతి బహుమతిని గెలిచే అన్ని రకాల అర్హతలు తనకు ఉన్నా కూడా రాకపోవడంపై,  ట్రంప్ నిరాశను వ్యక్తం చేస్తూ వచ్చారు.

మరోవైపు ఇరాన్, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, మరో రెండు సంఘర్షణలు కూడా త్వరలో పరిష్కారం కావచ్చని  మాట్లాడారు. మరో రెండు దేశాల మధ్య  శాంతిని నెలకొల్పబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.  తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని చెప్పడానికి తన దౌత్యపరమైన ప్రయత్నాలే సాక్ష్యమని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తనను పలుదేశాలు ఇప్పటికే నొబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించక పోవడం విచారకరమని ట్రంప్ తన ఆక్రోశంను మరోసారి వెళ్లగక్కారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES