Woman applies makeup in Delhi metro video viral: ఇటీవల మెట్రోలో కొంతమంది తరచుగా వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది రీల్స్ తీసుకుంటూ రచ్చ చేస్తుంటే, మరికొంత మంది రొమాన్స్ లు, అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ కాకరేపుతున్నారు. అంతే కాకుండా తమ పనులతో తోటి ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారు. చుట్టుపక్కల వారు చూస్తారని ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఏమైన చేసిన ఫెమస్ అయ్యేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
కొంత మంది కావాలని సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని నానా పాట్లు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో ఒక యువతి వాష్ రూమ్ లో వేసుకునే టవల్ ను వేసుకుని మెట్రో ఎక్కింది. అంతే కాకుండా ఆమె తన ముఖంకు మేకప్ వేసుకుంటూ రచ్చ చేసింది.
కూల్ గా చిన్న మిర్రర్ లో చూస్తు మేకప్ వేసుకుంటూ కూల్ గా అందరికి షాక్ ఇచ్చింది. తన కళ్ల కింద, ముఖంకు మేకప్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్యంకు గురి చేసింది.
చుట్టుపక్కల ఉన్నవారు ఏమైన అనుకుంటారా..?.. అని కనీసం ఆలోచించలేదు. సదరు యువతి పైత్యంను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్ ఇలా ఉన్నారెంట్రా అంటూ షాక్ అవుతున్నారు.