లంచ్ బ్రేక్‌లో లక్ అంటే ఇదే.. స్క్రాచ్ చేయగానే రూ.16 కోట్ల జాక్‌పాట్!
Lottery Winner: ఓ మహిళ లంచ్ టైమ్‌లో ఏకంగా రూ.16 కోట్లు లక్కీ లాటరీ గెలుచుకుంది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటు చేసుకుంది. అయితే, ఆ మహిళ ఎలా లాటరీ గెలుచుకుంది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Lottery Winner News: అదృష్టం ఎప్పుడు.. ఎలా? ఏ రూపంలో తలుపు తట్టుకుని నెట్టుకుని వస్తుందో ఊహించడం చాలా కష్టం.. సరిగ్గా ఇలాంటి అద్భుతమే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ మహిళ జీవితంలో జరిగింది.. అయితే, ఆఫీసులో భోజనం చేసేందుకు బయటకు వెళ్లిన ఆమె.. తిరిగి వచ్చే సరికి ఏకంగా రూ.16 కోట్ల జాక్‌ఫాట్‌లో కోటీశ్వరురాలిగా మారిపోయింది.. అయితే, అంత పెద్ద మొత్తం గెలిచినప్పటికీ.. ఆమె చూపించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దీనికి సంబంధంచిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్జీనియాకు సంబంధించిన మహిళ ఆఫీసులో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉంది.. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో మనస కాస్త ప్రశాంతంగా ఉండటానికి బయటకు వెళ్లింది.. ఆ సమయంలోనే సరదాగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అయితే, సమీపంలోని లవ్ ఫుడ్ మార్ట్ దుకాణానికి వెళ్లి రూ.1600 పెట్టి.. ఎంతో విలువైన Platinum 7s స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది.
అదే షాపులోన నిలబడి ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.. ఆ టికెట్‌పై అత్యధిక బహుమి రూ.16 కోట్లు అని వచ్చింది.. సాధారణంగా లాంటి భారీ మొత్తం గెలిచిన వెంటనే ఎవరైనా సంతోషంతో గంతులు వేస్తారు. ఆనందంలో ఏది పడితే అది చేస్తారు. లేదా వెంటన సెలవులు పెట్టి.. ఇంటికి వెళ్లిపోతారు. కానీ ఆమె అస్సలు ఆలా చేయలేకపోయింది.
తన లంచ్ బ్రేక సమయం అయిపోయిందని గుర్తించిన ఆమె.. తక్షణమే..తన భావోద్వేగాలను అదుపులోకి తీసుకుని.. గెలిచిన ఆ లక్కీ టికెట్‌ను జాగ్రత్తగా దాచుకుని.. ఏమీ తెలియనట్లు మళ్లీ తన ఆఫీస్‌కు చేరుకుంది. అంతేకాకుండా అక్కడ తన.. సహోద్యోగులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. రోజూలాగే ఎంతో ప్రశాంతంగా తన పనిని పూర్తి చేసుకుంది. ఆనంతరం లాటరీ అధికారులను సంప్రదింది. అలాగే వారి కలిసి నేరుగా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది.