SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Coins: చెత్త ఏరుతుంటే దొరికిన బంగారు బిస్కెట్స్‌.. ఎక్కడో తెలుసా?

Gold Coins: కష్టాల్లో ఉన్న ఓ మహిళ చెత్త ఏరుతున్న సమయంలో ఆమెకు బంగారు బిస్కెట్‌ దొరికాయి.. అయితే, తన భర్త ఎన్నో సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియకుండా.. బిస్కెట్‌ డబ్బలో పెట్టి.. స్టోర్‌ రూమ్‌లో ఉంచాడు.. చాలా ఏళ్ల తర్వాత ఆమె కంట పడడం విశేషం.. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 17, 2026, 12:35 IST | Updated: Nov 17, 2026, 12:36 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Gold Coins: జీవిత భాగస్వామిని కోల్పోయి.. అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒక మహిళకు ఊహించని రీతిలో అదృష్టం తలుపు తట్టింది.. ఇంట్లోని పాత సామాన్లను శుభ్రం చేస్తుండగా.. దొరికిన ఒక సాధారణ రేకు బిస్కెట్ డబ్బా.. ఆమె జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసింది. ఆ డబ్బాలో 50 ఏళ్ల నాటి అదృష్టంతో.. ఆ మహిళ ఏకంగా కోటీశ్వరురాలైంది.. ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లో పెన్జాన్స్ పట్టణంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది..

భర్త మరణం తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి.. ఇంటి ఖర్చులు గడవడానికి ఆ మహిళ రాత్రిపగలు తేడా లేకుండా ఎంతగానో కష్టపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంటి పెరట్లో ఉన్న పాత స్టోర్ రూమ్‌తో పాటు షెడ్డును శుభ్రం చేయాలని అనుకుంది.. అక్కడ పేరుకుపోయిన పనికిరాని వస్తువులను తీస్తుండగా.. దుమ్ముపట్టి ఉన్న ఒక పాత రేకు బిస్కెట్ డబ్బా ఆమెకు కనిపించింది. దానిని తెరిచి చూడగా పైభాగంలో కొన్ని చిల్లర వస్తువులతో పాటు పాత వెండి నాణేలు కనిపించాయట.. వాటి విలువ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆమె వెంటనే లేస్ ఆక్షనీర్స్ అనే వేలం వేసే దగ్గరికి ఆ డబ్బాను తీసుకెళ్లిందట..

మొదట వేలం సిబ్బంది కూడా దానిని ఒక సాధారణ పాత డబ్బాగానే అనుకున్నారట.. అయితే, ఆ డబ్బాను పూర్తిగా ఖాళీ చేసి.. చెక్ చేసి చూడగా.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట.. పైనున్న వెండి నాణేల కింద.. అసలైన మింట్ ప్యాకేజింగ్‌లో పెట్టిన 62 స్వచ్ఛమైన బంగారు నాణేలు వారికి కనిపించాయట.. దశాబ్దాలుగా ఆ డబ్బా అడుగున ఆ బంగారం ఎవరి కంటా పడకుండా ఉండిపోయిందట..

1975వ సంవత్సరంలో బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు ద్రవ్యోల్బణం సమయంలో ఆ మహిళ భర్త భవిష్యత్తు అవసరాల కోసం ఈ నాణేలను కొనుగోలు చేశారట.. అప్పట్లో ఒక్కో నాణేన్ని కేవలం 70 నుంచి 80 పౌండ్ల చొప్పున కొని.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిస్కెట్ డబ్బాలో దాచి షెడ్డులో పెట్టారట.. కాలక్రమేణా ఆయన కూడా ఆ విషయాన్ని మర్చిపోయారట.

తాజాగా ఈ 62 బంగారు నాణేలను వేలం వేయగా.. బ్రిటన్‌లో బంగారం కొనుగోలు చేసేవారు పోటీపడ్డారట.. వేలంలో నాణేలన్నీ కలిపి ఏకంగా 1,13,000 పౌండ్లకు అమ్ముడుపోయాయట. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.25 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఆ మొత్తం డబ్బులను సదరు మహిళకు కష్టాల్లో ఉన్న ఆమెకు అండగా నిలిచింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES