SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నర్సింగ్ పూర్తి చేశారా? ప్రభుత్వంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

Nurse Recruitment 2026: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే నర్సింగ్ కోర్స్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం అద్భుతమైన శుభవార్తను అందించింది. కాంట్రాక్టు బేస్డ్ పద్ధతిలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 14, 2026, 03:49 PM IST | Updated: Sep 21, 2026, 06:05 PM IST
Image Credit: నర్సింగ్ పూర్తి చేశారా? ప్రభుత్వంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!
Join

Nurse Recruitment 2026 In Telugu: వైద్య ఆరోగ్య రంగంలో సేవలు అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు తమిళనాడు ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. తమిళనాడు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. గ్రామీణతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అర్హత వివరాలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పకుండా కొన్ని నిర్దిష్ట విద్యార్హతలు ఉండాల్సి ఉంటుంది.. ముఖ్యంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి జనరల్ నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్) తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో అభ్యర్థి తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది.

వయోపరిమితి, ఎంపిక పద్ధతి..
నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాల్సి ఉంటుంది.. అంతేకాకుండా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు కూడా వర్తిస్తాయి. ఈ పోస్టుల భర్తీ పూర్తిగా పారదర్శకంగా ఉండబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థుల అకాడమిక్ మార్కులు.. అవసరమైతే నిర్వహించే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఈ జాబుల్లో ఎంపికైన ప్రతి ఒక్కరు సర్టిఫికెట్స్ తో పాటు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక జీతంకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ హెల్త్ కమిషన్ నిబంధనల ప్రకారం.. నెలకు తగిన తగిన మొత్తంలో గౌరవ వేతనం చెల్లిస్తారని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లోని వీరిని నియమించనున్నారు.

నర్సింగ్ వృతిలో సెటిల్ అవ్వాలనుకుంటున్న యువతకు మంచి అనుభవం సంపాదించడానికి.. అలాగే ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు అందించడానికి ఇది మంచి అవకాశం అని ప్రభుత్వం భావిస్తూ ఉంది.. పూర్తి వివరాలతో పాటు ఆన్లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తప్పకుండా తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక పోటల్ ను సందర్శించండి.

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES