SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

200MP కెమెరాతో Vivo X500 సిరీస్ లాంచ్‌కు సిద్ధం? అక్టోబర్ 27న విడుదల!

Vivo X500 Launch Date: మార్కెట్‌లో వివో కంపెనీ X500 సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27న దీనిని లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్‌ కెమెరా సెటప్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 09, 2026, 02:47 PM IST | Updated: Oct 09, 2026, 02:48 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Vivo X500 Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo తమ కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ వివో X500 సిరీస్‌లో భాగంగా అన్ని మోడల్స్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, అక్టోబర్ 27న యూరోపియన్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. మొదటగా కంపెనీ వివో X500 FE (Vivo X500 FE) మోడల్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తాజా అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ V2653 మోడల్ నంబర్‌తో ఇండోనేషియాకు చెందిన టీకేడీఎన్ (TKDN) సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా గతంలో కూడా ఇదే మోడల్ నంబర్ జీఎస్ఎమ్ఏ (GSMA) డేటాబేస్‌లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 5G NR, 4G LTE, GSM వంటి అద్భుతమైన కనెక్టివిటీ నెట్‌వర్క్‌ల సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.

వివో X500 సిరీస్ ఫీచర్లతో పోలిస్తే.. X500 FE మోడల్‌లో కొన్ని అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రధాన మోడల్ 6.59 అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ (AMOLED) డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz నుంచి 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది.

ఇక రెగ్యులర్ X500లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ FE వేరియంట్‌లో కాస్త తక్కువ ధరకే లభించే శక్తివంతమైన 5G చిప్‌సెట్‌ను లేదా ఆప్టిమైజ్ చేసిన డైమెన్సిటీ ప్రాసెసర్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో కూడా హై-రిజల్యూషన్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. వివో ఎక్స్ సిరీస్ ఫోన్లకు తగ్గట్లే మోస్ట్ పవర్‌ఫుల్ భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీవో కంపెనీ అన్ని వివరాలను, ముఖ్యంగా ధర వివరాలను వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES